Share News

Disqualification Petition: ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు

ABN , Publish Date - Dec 17 , 2025 | 09:25 AM

అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డిల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ తుది తీర్పు ప్రకటించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

Disqualification Petition: ఉత్కంఠకు తెర.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజే తీర్పు
Disqualification Petition

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ తుది తీర్పు ప్రకటించనున్నారు. ఈ పిటిషన్లకు సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేల తరఫు అడ్వకేట్లకు స్పీకర్ కార్యాలయం ఇప్పటికే నోటీసులు పంపింది. ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో స్పీకర్ తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావ్‌, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌ గౌడ్‌, గూడెం మహిపాల్‌రెడ్డిల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.


ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో ఐదుగురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. ఒక పార్టీనుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఐదుగురిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు వారిపై స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఐదుగురిపై చర్యలకు సిద్ధమయ్యారు. బుధవారం ఐదుగురిపై అనర్హత ఉంటుందా? లేదా అన్నదానిపై స్పీకర్ నిర్ణయం తీసుకోనున్నారు. ఒక వేళ స్పీకర్ వారిపై అనర్హత వేటు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.


ఇవి కూడా చదవండి

ఈ అలవాట్లు మీ ఇమేజ్‌ను నాశనం చేస్తాయి..!

బతకాలని లేదా?.. చావును చేతుల్లో పట్టుకున్నావేంటి బాబు..

Updated Date - Dec 17 , 2025 | 09:42 AM