Share News

Local Body Election: ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..

ABN , Publish Date - Dec 17 , 2025 | 07:24 AM

అభ్యర్థులు ప్రచార పర్వం కొనసాగిన ప్రతిరోజు మందు, మాంసంతో విందులు కొనసాగించారు. పల్లెలను మత్తులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు.

Local Body Election:  ఒక్కో ఓటుకు రూ.3 వేలు.. డబ్బులు తీసుకుని కూడా..
Local Body Election

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ దేవున్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు అష్టకష్టాలు పడ్డారు. వారి అభిరుచులు తెలుసుకొని విందు, మందు, నజరానాలు సమర్పించుకున్నారు. ఇంటికి వచ్చిన అభ్యర్థిని ఓటర్లు మాత్రం నీకే మా ఓటు- అంటూ అందరినీ ఊరడించారు. అభ్యర్థుల బలహీనత, అవసరాన్ని ఆసరా చేసుకుని ఓటర్లు ముప్పు తిప్పలు పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2288 వార్డు సభ్యుల ఎన్నికల్లో రెండు దశలు పూర్తికాగా మూడో దశ బుధవారం నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా, అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నంగా ఓటుకు నోటుకు మూటలు విప్పినా చలిలోనూ అభ్యర్ధులకు చమటలు పట్టే పరిస్థితి ఏర్పడింది.

తుది విడతలో 80 సర్పంచి స్థానాల్లో 381 మంది అభ్యర్థులు 551 వార్డు స్థానాల్లో 1526 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార పర్వం కొనసాగిన ప్రతిరోజు మందు, మాంసంతో విందులు కొనసాగించారు. పల్లెలను మత్తులో ఉంచారనే విమర్శలు వచ్చాయి. ప్రతి ఇంటికి మటన్, చికెన్, కానుకలు పంపిణీ చేశారు. సామాజికవర్గాల వారీగా దావతులు ఏర్పా టుచేసి ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసన అభ్యర్థులు ప్రచారం ముగి యడంతోనే మంగళవారం ఓట్లకు నోట్లు పంచారు. ఒక్క ఓటుకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు పంచినట్లుగా చెప్పుకుంటున్నారు. దీంతో పాటు ఇంటింటికి మద్యం, కానుకలు అందించినట్లు బాటంగానే చర్చించుకుంటున్నారు. ఓటర్ల డిమాండ్లను ఒప్పుకుంటున్న అభ్యర్ధు లకు మాత్రం ఓటర్ నాడిని పసిగట్టలేక పోతున్నారు. ఉద్యోగం, ఉపా ది. చదువుల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించడానికి అభ్య ర్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వారి ఓట్లే కీలకంగా మారడంతో ప్రత్యేక వాహనాలు, ఖర్చులు భరించి రప్పింస్తున్నారు.

అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం జిల్లాలో మొదటి, రెండో దశలో వచ్చిన పంచాయతీ ఫలితాల్లో జరిగిన మార్పులు, ఫలితాల తారుమారుతో మూడో విడత అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. తమతోటే తిరుగుతున్న నాయకులు, అనుచరులపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సర్పంచ్ అభ్యర్థులు రూ.50లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇంత ఖర్చు చేస్తున్న అభ్యర్థుల వెంట తిరుగు తున్న నాయకులు క్రాస్ ఓటింగ్కు పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు పార్టీ బలపరిచిన అభ్యర్థు లకు నాయకులు సహకరించడం లేదని తెలుస్తోంది. పార్టీల ప్రమే యం లేకుండా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఓకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో ఆ పార్టీలోని నాయకులు అభ్యర్థుల వారిగా విడిపోయి ప్రచారం చేశారు. కొందరు పార్టీ మద్దతు ప్రకటించిన అభ్యర్థులకు ప్రచారం చేసిన క్రాస్ ఓటింగ్ జరిగితే ఎలా అనే సందిగ్ధంలో అభ్యర్థులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆఖరి యత్నం.. సెంటిమెంట్ అస్త్రం

3 రోజుల్లో 12 క్వింటాళ్ల చికెన్ హాంఫట్

Updated Date - Dec 17 , 2025 | 07:48 AM