Home » Asifabad
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన పర్యటించే అవకాశాలు ఉన్నాయి.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పెద్దవాగు రైల్వే బ్రిడ్జి పనుల్లో కార్మికులకు ప్రమాదం జరిగింది. థర్డ్ లైన్ పనులు చేస్తూ ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇటీవల శుభకార్యాలు, పండగలు, ప్రత్యేక కార్యక్రమాల్లో డీజే సౌండ్‌తో దద్దరిల్లుతున్నాయి. దీని వల్ల చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మహిళలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలకు విక్రయించిన ఇద్దరు మహిళను పోలీసులు రక్షించారు.
కొమురంభీం ఆసిఫాబాద్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం రాస్పెల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
రాష్ట్రంలో చలి తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాబోయే రెండు మూడు రోజుల పాటు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
కొమురం భీం ఆసిఫాబాద్ మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను అతి వేగంతో కారు ఢీకొనడం..
ఆసిఫాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత కోవ లక్ష్మి సహనం కోల్పోయారు. ఆసిఫాబాద్‌లోని రైతు వేదికలో గురువారం జరిగిన రేషన్ కార్డుల పంపిణీలో ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్‌ఇన్‌చార్జి శ్యాంనాయక్‌పై మంచి నీళ్ల సీసాలు విసిరారు.
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న టైగర్ కన్జర్వేషన్ జోన్ విషయంలో సర్కారు కాస్త వెనక్కి తగ్గింది. సుమారు 330 గ్రామాలను ప్రభావితం చేయనున్న ఈ పులుల సంరక్షణ కేంద్రంపై ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది.
ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన మహిళలను టార్గెట్ చేసిన ముఠా.. వారికి మాయమటలు చెప్పి, ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ వారితో ఈ ముఠా బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది.