Share News

Asifabad: కాంగ్రెస్‌ నేతపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం నీళ్ల సీసా విసిరిన కోవ లక్ష్మి

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:31 AM

ఆసిఫాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత కోవ లక్ష్మి సహనం కోల్పోయారు. ఆసిఫాబాద్‌లోని రైతు వేదికలో గురువారం జరిగిన రేషన్‌ కార్డుల పంపిణీలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ఇన్‌చార్జి శ్యాంనాయక్‌పై మంచి నీళ్ల సీసాలు విసిరారు.

Asifabad: కాంగ్రెస్‌ నేతపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆగ్రహం నీళ్ల సీసా విసిరిన కోవ లక్ష్మి

  • ఆసిఫాబాద్‌లో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీలో ఘటన

  • ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు

  • సద్వినియోగం చేసుకోవాలన్న అదనపు కలెక్టర్‌

  • తమ హయాంలో ఎన్నో జరిగాయన్న ఎమ్మెల్యే లక్ష్మి

  • అడ్డు చెప్పిన కాంగ్రెస్‌ నేతతో ఎమ్మెల్యే వాగ్వాదం

ఆసిఫాబాద్‌, ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నేత కోవ లక్ష్మి సహనం కోల్పోయారు. ఆసిఫాబాద్‌లోని రైతు వేదికలో గురువారం జరిగిన రేషన్‌ కార్డుల పంపిణీలో ఆసిఫాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ఇన్‌చార్జి శ్యాంనాయక్‌పై మంచి నీళ్ల సీసాలు విసిరారు. దీంతో రేషన్‌ కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి లబ్ధిదారులకు గురువారం రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రేషన్‌కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.


అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్పించుకుని కాంగ్రెస్‌ తమమ్యానిఫెస్టోలో రేషన్‌కార్డుల పంపిణీ విషయం పెట్టిందని, అందులో భాగంగానే కొత్త కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. దీంతో కల్పించుకున్న శ్యాంనాయక్‌.. ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడే విధానం తెలుసుకోవాలని సూచించారు. దీంతో సహనం కోల్పోయిన కోవ లక్ష్మి.. తన ముందు బల్లపై ఉన్న మంచినీటి సీసాను తీసి శ్యాంనాయక్‌పైకి విసిరారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తత నెలకొనగా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ నచ్చజెప్పి శాంతింపజేశారు.

Updated Date - Aug 08 , 2025 | 04:31 AM