Share News

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:30 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్‌.కృష్ణయ్య లేఖ

- ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

- 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలి

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బీసీలకు 42శాతం రిజర్వేషన్లతోనే నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) గురువారం లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీసీ భవన్‌లో ఆయన వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను స్థానిక సంస్థలలో అమలు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఇటీవల జరిగిన సర్పంచి ఎన్నికల్లో ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందన్నారు.


city7,2.jpg

రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ(MPTC, ZPTC) ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు చేసిన తర్వాత నిర్వహించాలని కోరారు. అలా చేయకుండా ఎన్నికలకు వెళితే జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున పెద్దఎత్తున బీసీ ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 డిసి ప్రకారం స్థానిక సంస్థలలోని బీసీ రిజర్వేషన్‌ పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. బీసీలకు ఇచ్చిన హామీని సీఎం అమలు చేసి మాట నిలుపుకోవాలని, లేనిపక్షంలో బీసీల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహానగరంలో మత్తు మూకలు!

ప్రతి దరఖాస్తుకూ జవాబుదారీ

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2025 | 10:30 AM