Home » R Krishnaiah
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను వెంటాడుతాం.. అని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆయన మాట్లాడుతూ... పంచాయతీ ఎన్నికల్లో జీఓ46ను తీసుకొచ్చి బీసీలను ప్రభుత్వం దగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీలకు కల్పించిన 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగ బద్ధంగా అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పార్టీల పరంగా 42శాతం రిజర్వేషన్లు బీసీలకు అవసరం లేదని చట్టబద్ధంగానే అమలు చేయాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య శాఖలో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నులశాఖ అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం నాయకులు రాజు, రాంబాబుల ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల గర్జన నిరసన ర్యాలీ జరిగింది.
స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం త్వరలో బీసీ రథయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్.కృష్ణయ్య తెలిపారు. మంగళవారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల అమలును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే నవంబరు రెండవ వారంలో రథయాత్ర ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు.
బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.
బీసీల బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు కవిత.
బీసీల వాదన వినకుండా తెలంగాణ హైకోర్టు ఏకపక్షంగా స్టే ఇచ్చిందని ఎంపీ, బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్స్‌పై హైకోర్టు స్టే ఇవ్వడంతో న్యాయం జరుగలేదని ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు.
అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహించనున్నట్లు ఆర్. కృష్ణయ్య చెప్పారు. అందరూ కలిసి బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగిందన్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో స్టే ఇవ్వవద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు ఆర్.కృష్ణయ్య. సుప్రీంకోర్టుకు విరుద్ధంగా హైకోర్టు స్టే ఇవ్వడం బీసీ ప్రజల నోరు కొట్టడమేనని.. నోటికాడ అన్నం ముద్ద లాక్కోవడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, 2 లక్షల నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ 13రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు.