Share News

R. Krishnaiah: రాజ్యాంగ సవరణ చేయాల్సిందే..

ABN , Publish Date - Oct 25 , 2025 | 09:48 AM

బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.

R. Krishnaiah: రాజ్యాంగ సవరణ చేయాల్సిందే..

- రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య

హైదరాబాద్: బీసీల జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని, దీనికి అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో మద్దతు తెలపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమం దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు. ఇప్పుడు యుద్ధ భూమిలో ఉన్నామని, విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని త్యాగాలకు సిద్ధం కావాలన్నారు.


బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నీల వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి అజయ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ విద్యార్థుల సదస్సులో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే హైకోర్టు స్టే ఇచ్చిందని ఆరోపించారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించడమే శాశ్వత పరిష్కారమని అన్నారు. బీసీ జేఏసీ రాష్ట్ర బంద్‌ పూర్తిగా విజయవంతమైందని, ఇది బీసీల చైతన్యనానికి ప్రతీక అన్నారు.


city5.2.jpg

రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో ఈ నెల 26న అన్ని జిల్లా, నియోజకవర్గం కేంద్రాలలో బీసీ, కుల, ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అన్ని మండల కేంద్రాలలో దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను 56 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ, నాయకులు వేముల రామకృష్ణ, జి.అనంతయ్య, సి.రాజేందర్‌, రిష్విక్‌, వెంకటేష్‌, రాజు, శివయాదవ్‌, వంశీ, వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌కుమార్‌, వేణుగోపాల్‌; భాస్కర్‌, నరేష్‌, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 09:48 AM