MP R. Krishnaiah: ఆ వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 09:16 AM
రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య శాఖలో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నులశాఖ అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం నాయకులు రాజు, రాంబాబుల ఆధ్వర్యంలో విద్యానగర్ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల గర్జన నిరసన ర్యాలీ జరిగింది.
- ఎంపీ ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య శాఖలో పనిచేస్తున్న అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలను చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) డిమాండ్ చేశారు. వాణిజ్య పన్నులశాఖ అద్దె వాహనాల డ్రైవర్ల సంఘం నాయకులు రాజు, రాంబాబుల ఆధ్వర్యంలో సోమవారం విద్యానగర్ నుంచి వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల గర్జన నిరసన ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖల్లో గత 9 నెలలుగా అద్దె వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల అనేక మంది వాహనదారులు, డ్రైవర్లు వాహనాల ఈఎంఐలను కట్టలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోవింద్, నవీన్, శ్రావణ్, సతీష్, ముజాహిద్, జానయ్య, అశోక్, మురళీ, నర్సింహ, కుమార్, వెంకటయ్య, శ్రీనివాసరెడ్డి, రాజు, బాలనర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
Read Latest Telangana News and National News