42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Apr 28 , 2026 | 09:17 AM
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్.కృష్ణయ్య లేఖ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య సోమవారం లేఖ రాశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకుని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్ధానం ప్రకారం 42శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం బీసీలను అణచివేసేందుకు ప్రయత్నించినప్పటికీ పంచాయతీ ఎన్నికలలో 53శాతం, మున్సిపల్‌లో 68 శాతం బీసీలు గెలిచి సత్తా చాటారని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లపై కోర్టులో ఉన్న స్టేను ఎత్తివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను ఆయన కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం
Read Latest Telangana News and National News