Share News

సంస్కృతాంధ్ర పరిశోధకురాలు శొంఠి శారదాపూర్ణ కన్నుమూత

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:33 AM

తెలుగు, సంస్కృత భాషల్లో పరిశోధకురాలు, రచయిత్రి శొంఠి శారదాపూర్ణ(75) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు.

సంస్కృతాంధ్ర పరిశోధకురాలు శొంఠి శారదాపూర్ణ కన్నుమూత

  • సంగీత, సాహిత్య పరిశోధనా రంగంలో విశేష కృషి

  • అంతర్జాతీయ సదస్సుల్లో వేదాలపై పరిశోధనాపత్రాల సమర్పణ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌27(ఆంధ్రజ్యోతి): తెలుగు, సంస్కృత భాషల్లో పరిశోధకురాలు, రచయిత్రి శొంఠి శారదాపూర్ణ(75) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు. శారదాపూర్ణ భర్త దివంగత శొంఠి శ్రీరాం హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ నేత్రాలయం వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆమె తండ్రి సుసర్ల గోపాలశాస్త్రి నేతాజీ నెలకొల్పిన ‘ఆజాద్‌ హింజ్‌ఫౌజ్‌’లో పనిచేశారు. వివాహానంతరం భర్త వెంట 1975లో అమెరికా వెళ్లిన శారదా పూర్ణ మొదట చికాగో, డెపాల్‌ యూనివర్సిటీలో పిల్లల మనస్తత్వ శాస్త్రంలో కోర్సు పూర్తిచేసి కౌన్సెలింగ్‌ సేవలందించారు. ఆమె ఆంధ్రా యూనివర్సిటీ నుంచి తెలుగులో, సంస్కృతంలో పీహెచ్‌డీ చేశారు.

Updated Date - Apr 28 , 2026 | 07:34 AM