ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని..
ABN , Publish Date - Apr 28 , 2026 | 08:12 AM
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పెట్రోల్ పోసుకుని ఓయూ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని సూసైడ్ నోట్ రాసి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి సోమవారం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓయూ పోలీసుల వివరాల ప్రకారం..మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన వినీష్ (19) ఓయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైనింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ సమీపంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే తీవ్ర గాయాలతో ఉన్న వినీష్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందుతోంది. అతని శరీరం 70 శాతం వరకు కాలిపోయి ముఖ భాగం తీవ్రంగా దెబ్బతిన్నదని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను గుర్తించారు. ఇదివరకు కూడా వినీష్ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం
Read Latest Telangana News and National News