Share News

జేఎన్‌టీయూ విద్యార్థులకు జర్మనీలో ఇంటర్న్‌షిప్‏లు

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:52 AM

జేఎన్‌టీయూలో ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేడెట్‌ బ్యాచిలర్‌ అండ్‌ మాస్టర్స్‌ (బీటెక్‌, ఎంఎస్‌) పోగ్రామ్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది తీపి కబురే.

జేఎన్‌టీయూ విద్యార్థులకు జర్మనీలో ఇంటర్న్‌షిప్‏లు
JNTU H

  • తొలి సెమిస్టర్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక

  • ప్రముఖ కంపెనీల్లో ప్రాజెక్టు బేస్డ్‌ లెర్నింగ్‌కు అవకాశాలు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూలో ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేడెట్‌ బ్యాచిలర్‌ అండ్‌ మాస్టర్స్‌ (బీటెక్‌, ఎంఎస్‌) పోగ్రామ్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది తీపి కబురే. ఐదున్నరేళ్లపాటు కొనసాగే ఈ పోగ్రామ్‌ నిర్వహణ నిమిత్తం జర్మనీలోని రౌట్లింగన్‌ యూనివర్సిటీతో జేఎన్‌టీయూ గతేడాది ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం బీటెక్‌ ఫస్టియర్‌ తొలి సెమిస్టర్‌ పూర్తి చేసుకున్న విద్యార్థుల్లో ఇద్దరు టాపర్లకు జర్మనీలోని ప్రముఖ కంపెనీలైన మెర్సిడెస్‌ బెంజ్‌, బీఎండబ్ల్యూ వంటి ఆటోమోటివ్‌ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవల్‌పమెంట్‌ కోసం ఉచిత ఇంటర్న్‌షిప్‌ అవకాశాలను కల్పిస్తున్నట్లు ఇండో-యూరో సింక్రనైజేషన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజ్‌ వంగపండు ప్రకటించారు.


city2.2.jpgసోమవారం యూనివర్సిటీ ఉన్నతాధికారులతో జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఐఐటీల్లో మాదిరిగా ప్రాజెక్టు బేస్డ్‌ లెర్నింగ్‌ విధానాన్ని జేఎన్‌టీయూలోని ఐఐబీఎంపీ విద్యార్థులకు పరిచయం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఐఐబీఎంపీ పోగ్రామ్‌లోని విద్యార్థులందరికీ ఫస్టియర్‌ బీటెక్‌లో వారు నేర్చుకున్న సాంకేతిక అంశాలను ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు ఇంటర్న్‌ అవకాశాలను సిద్ధం చేశామన్నారు. తమ సంస్థతో అఫిలియేషన్‌ కలిగిన టీసీఎస్‌, ఐబీఎం..తదితర సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఫిజికల్‌/వర్చువల్‌ ఇంటర్న్‌షి్‌పలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తొలిఏడాది 2నుంచి 4వారాల పాటు, రెండో ఏడాది 6నుంచి 8వారాల పాటు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రబీ మొక్కజొన్న కొనుగోలు చేయాలి

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచుదాం

Read Latest Telangana News and National News

Updated Date - Apr 28 , 2026 | 07:52 AM