Home » Kukatpally
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటివరకు కిలో టమోటా రూ. 50 నుంచి రూ. 60 వరకు ఉండగా.. ప్రస్తుతం ధర తగ్గిపోయింది. కిలో రూ. 31కి విక్రయిస్తున్నారు. అలాగే.. గోరుచిక్కుడును రూ. 45లకు విక్రయిస్తున్నారు. మొత్తంగా రైతుబజార్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..
గ్యాస్ డెలివరీ బాయ్ ముసుగులో గంజాయి సరఫరా చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కూకట్‌పల్లికి చెందిన గాదె అజయ్ అనే యువకుడు గ్యాస్ డెలివరీ బాయ్ గా పనిచేస్తూ.. గంజాయిని కూడా సరఫరా చేస్తున్నాడు. సమాచారమందుకున్న పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేశారు.
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొన్నటి వరకు టమోటా కేజీ రూ. 50కి పైగానే ఉన్న ధర కొంచెం తగ్గింది. ప్రస్తుతం రూ. 35కి విక్రయిస్తున్నారు. అయితే.. బెండకాయకు ధర పెరిగింది. కిలో రూ. 45 నుంచి రూ. 55 వరకు విక్రయస్తున్నారు. మొత్తంగా కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే...
దేశాన్ని నడిపిస్తున్న ఎంతోమంది గొప్ప వ్యక్తులను సృష్టించిన జేఎన్‌టీయూను జాతీయ ఆస్తిగా పరిగణించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జేఎన్‌టీయూలో జరిగిన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటివరకూ అమలు కాలేదని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నగదు ప్రోత్సాహకంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి.. రెండేళ్లు కావస్తున్నా నేటికీ అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తోందన్నారు.
నగరంలోని కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటివరకు కొంచెం తక్కువగా ఉన్నా గురువారం మాక్కెట్లో అమాంతం పెరిగిపోయాయి. ఇది సామాన్యులకు భారంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయంటే...
కూకట్‌పల్లి నియోజకవర్గంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పలు కాలనీల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి, పగలు అన్న తేడా లేకుండా స్థానికులను వెంటాడి కరుస్తున్నాయి.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాట 25, వంకాయ 45, బెండకాయ 45, పచ్చిమిర్చి 35, బజ్జిమిర్చి 40, కాకరకాయ 45, బీరకాయ 45, క్యాబేజీ 20, బీన్స్ 55, క్యారెట్ 60, గోబిపువ్వు 30, దొండకాయ 55, చిక్కుడు కాయ 55, గోరుచిక్కుడు 70, బీట్‌రూట్ 40, క్యాప్సికం 40, ఆలుగడ్డ 26, కీర 23, దోసకాయ 18లకు విక్రయిస్తున్నారు.
తనపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై ఏ సిట్టింగ్ జడ్జితోనైనా విచారణకు సిద్ధమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు ప్రతి సవాల్ విసిరారు. ఇల్లు, కాలేజీ, సీలింగ్ ల్యాండ్, మఠం ల్యాండ్, కేపీహెచ్‌పీ భూములుపై విచారణ చేయాలని, ఈ విషయంలో తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు.
కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలు (కిలో, రూపాయల్లో) ఈ విధంగా ఉన్నాయి. టమోట 27, వంకాయ 40, బెండకాయ 45, పచ్చి మిర్చి 28, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 23, బీన్స్ 55, క్యారెట్ 65, గోబిపువ్వు 30, దొండకాయ 35, చిక్కుడు కాయ 55లకు విక్రయిస్తున్నారు.