హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆటో ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:20 PM
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. హైదర్‌నగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ కొట్టడంతో నర్సింహ(60) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
హైదరాబాద్, జులై 20: నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. హైదర్‌నగర్ వద్ద రోడ్ క్రాస్ చేస్తుండగా ఆటో ఢీ కొట్టడంతో నర్సింహ(60) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్ట్ అయ్యింది.
మృతుడు జహీరాబాద్‌లోని శిశుమందిర్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసి రిటైర్ అయినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటూ జహీరాబాద్‌లో ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు(సోమవారం) జహీరాబాద్ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఆటో.. నర్సింహను బలంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయన స్పాట్‌లోనే మృతిచెందాడు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నర్సింహ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్
‘రిపోర్టులో అన్ని విషయాలూ తెలుస్తాయి’.. ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్‌పై డాక్టర్
Read Latest Telangana News And Telugu News