మంత్రి నిమ్మల సీరియస్.. కాంట్రాక్టర్, అధికారిపై కేసు నమోదు
ABN , Publish Date - Jul 20 , 2026 | 02:41 PM
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముక్కామల నడిపూడి మధ్య నేదునూరు పెదపాలెం వద్ద ప్రధాన పంట కాలువపై రిటర్నింగ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్, ఆర్ అండ్ బి అధికారులపై అయినవిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, జులై 20: జిల్లాలోని ముక్కామల నడిపూడి మధ్య నేదునూరు పెదపాలెం వద్ద ప్రధాన పంట కాలువపై రిటర్నింగ్ వాల్ నిర్మించిన కాంట్రాక్టర్, ఆర్ అండ్ బి అధికారిపై అయినవిల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈనెల 17న పంట కాలువలను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా పంట కాలువ ద్వారా సాగునీరు సరఫరా కాకుండా అడ్డుగా రిటర్నింగ్ వాల్ నిర్మించారంటూ మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై నిమ్మల సీరియస్‌గా స్పందించారు.
సంబంధిత కాంట్రాక్టర్, అధికారులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జలవనరుల శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిమ్మల ఆదేశాలతో కొత్తపేట ఇరిగేషన్ ఏఈ సాయి పవన్.. అయినవిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో సుధారామ కన్‌స్ట్రక్సన్స్‌కు చెందిన కాంట్రాక్టర్ పి.పద్మరాజు, ఆర్ అండ్ బి డీఈ నిక్కీ క్రూజ్‌లపై Cr.NO.85/2026 U/Sec: 326(a), 326(b), 326 (C) r/w3(5) BNS సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..
Read Latest AP News And Telugu News