‘రిపోర్టులో అన్ని విషయాలూ తెలుస్తాయి’.. ఉదయ్ కృష్ణారెడ్డి హెల్త్‌పై డాక్టర్
ABN , Publish Date - Jul 20 , 2026 | 01:35 PM
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు.
హైదరాబాద్, జులై 20: మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను లైంగికంగా వేధించారన్న ఆరోపణలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ రవిశంకర్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఈరోజు(సోమవారం) ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఉదయ్ కృష్ణారెడ్డిని ఆస్పత్రికి తీసుకొచ్చారని.. ఆ సమయంలో ఆయన స్పృహలో లేనట్లు తెలిపారు. ఆస్పత్రికి తీసుకొచ్చిన వెంటనే కడుపును శుభ్రం చేశామని, అయితే కడుపులో ఏమీ కనిపించలేదని డాక్టర్ వెల్లడించారు.
కృష్ణారెడ్డి ఏమీ తీసుకోలేదనే అనుకుంటున్నామని.. రిపోర్టులో అన్ని విషయాలు వివరంగా తెలుస్తాయని డాక్టర్ చెప్పారు. ఆయన ఏదైనా విష పదార్థం తీసుకున్నారేమో అనే అనుమానంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. బ్లడ్ సేకరించామని.. రిపోర్ట్స్ వచ్చాక ఆయన ఏం తీసుకున్నారనేది తెలుస్తుందన్నారు. వైటల్స్‌తో పాటు బీపీ పల్స్ అన్నీ స్టేబుల్‌గా ఉన్నట్లు చెప్పారు. ఉదయ్ కృష్ణారెడ్డి స్పృహలోకి రావడానికి మరో 24 గంటల సమయం పడుతుందన్నారు. కృష్ణారెడ్డి బెడ్ పక్కన ఆల్కహాల్ బాటిల్‌తో పాటు శానిటైజర్ బాటిల్ పడి ఉందని వాళ్ల సోదరుడు చెప్పారని డాక్టర్ రవిశంకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ ఆరోపణలన్నీ నిరాధారం: కృష్ణారెడ్డి తమ్ముడు
‘ఉదయం మా అన్నయ్య అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే ఆసుపత్రికి తీసుకుని వచ్చాం. ప్రస్తుతం ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందనే డాక్టర్లు చెబుతున్నారు. ఏం తీసుకున్నారన్నది తెలియాల్సి ఉంది. బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాక ఆయన ఏం తీసుకున్నారో అనేదానిపై క్లారిటీ వస్తుంది. ఉదయ్ కృష్ణారెడ్డి ఏ తప్పు చేయలేదు. ఆయనపై జరుగుతున్న ప్రచారాలన్నీ అవాస్తవాలు. ఆయనను నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేయలేదు. ఎక్స్ట్రాడినరీ లీవ్ (EOL) తీసుకుని వచ్చారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ముభావంగా ఉన్నారు. కృష్ణారెడ్డి.. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ స్థాయికి చేరుకున్నారు. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలను చూశారు. మా అన్నయ్యపై మహిళా ట్రైనీ ఐపీఎస్ చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమైనవి’ అని ఏబీఎన్‌తో ఉదయ్ కృష్ణారెడ్డి తమ్ముడు ప్రణయ్ కృష్ణారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సస్పెన్షన్
Read Latest Telangana News And Telugu News