Share News

కృష్ణాజిల్లాలో యువకుడి హల్‌చల్.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి

ABN , Publish Date - Jul 20 , 2026 | 01:06 PM

కృష్ణా జిల్లా కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు.

కృష్ణాజిల్లాలో యువకుడి హల్‌చల్.. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి
Krishna District News

కృష్ణా జిల్లా, జులై 20: జిల్లాలోని కరకట్టపై అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై ఓ యువకుడి దాడి తీవ్ర కలకలం రేపుతోంది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు వద్ద ద్విచక్ర వాహనంతో అడ్డగించి మరీ వారిద్దరిపై యువకుడు దాడికి తెగబడ్డాడు. బస్సు ఆపలేదనే కారణంతో డ్రైవర్ సురేష్, కండక్టర్ లీలాప్రసాద్‌పై దాడి చేశాడు. అడ్డొచ్చిన ప్రయాణికులనూ అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో అతడిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో కరకట్టపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది.


యువకుడి హల్‌చల్‌తో దాదాపు 94 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తిని పి.కృష్ణప్రసాద్‌గా గుర్తించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిషోర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

విక్రమ్‌-1 విజయంలో తెలుగు తేజాల కృషి

ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2026 | 01:06 PM