హంద్రీనీవా గురించి మాట్లాడటం సిగ్గుచేటు.. వైసీపీపై పరిటాల సునీత ఆగ్రహం
ABN , Publish Date - Jul 20 , 2026 | 12:03 PM
హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో ఆదివారం నాడు ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే.
శ్రీ సత్యసాయి జిల్లా, జులై 20: హంద్రీనీవా ప్రాజెక్టు పొడవునా ఉన్న చెరువులను ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, ధర్మవరం టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ పేరుతో నిన్న(ఆదివారం) ఆ కాలువను వైసీపీ నేతల బృందం పరిశీలించిన విషయం తెలిసిందే. హంద్రీనీవా కాలువల పరిశీలన పేరుతో వైసీపీ నేతల బృందం పర్యటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. సూపర్ ఎల్‌నినో కాలంలో కూడా చాలా చోట్ల నీటి సమస్యలు ఉన్నా.. చెరువులలో నిండుగా నీరు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిది అని అన్నారు. గత ప్రభుత్వంలో గంప మట్టి కూడా ఎత్తివేయని వైసీపీ నాయకులు.. హంద్రీనీవా గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
‘హంద్రీనీవా లైనింగ్ పనులలో ఎక్కడ నాసిరకం పనులు జరిగాయి? ఏ కాంట్రాక్టర్ చేశాడో చెప్పండి? నాసిరకం పనులు చూపితే అదే కాంట్రాక్టర్‌తో పనులను సరిచేయిస్తాం. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు నీటితో నిండిన చెరువులను చూసి ఆత్మవిమర్శ చేసుకోండి’ అంటూ ఎమ్మెల్యే హితవుపలికారు. వైసీపీలో రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి లాంటి నేతలు.. కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ప్రశంసిస్తున్నారని తెలిపారు. వైసీపీ.. పార్టీ మనుగడ కోసం పొరుగు జిల్లాల నుంచి నేతలను పిలిపించుకొని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ..
Read Latest AP News And Telugu News