మండలపరిధి లోని పెడబల్లిగ్రామ చెరువు ఆకట్టు కింద రైతులు పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో విద్యుత 11కేవీ వైర్లు చాలా తక్కువ ఎత్తులో వేలాడుతున్నాయి. దీంతో ఆ వైర్లు వెళుతున్న తమ పొలాల్లోకి వ్యవసాయ పనులు చేసేందుకు ట్రాక్టర్లు రావడం లేదని రైతులు వెంకటరమణ, వెంకటయ్య తదితరులు పేర్కొన్నారు.
ఎస్పీ సతీష్కుమార్ మంగళవారం మండలకేంద్రం లోని పోలీస్ స్టేషనతో పాటు సర్కిల్ కా ర్యా లయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్స్టేషన భవనాన్ని పరిశీ లించారు. పైకప్పు పెచ్చులూడి కడ్డీలు దర్శన మిస్తుండడంతో సమస్య ఏమిటని సీఐ నరేం ద్రరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
స్థానిక తహసీల్దార్ కార్యాల యాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరిశీలించారు. కార్యాల యంలోని రికార్డులు, మ్యుటేషన ఫైల్స్, రెవె న్యూ రిజిస్టర్లను పరిశీలించారు. పెడబల్లిలో నిర్వహిస్తున్న భూ రీసర్వేపై సిబ్బందితో సమీ ించారు. తప్పులు లేకుండా రెవెన్యూ రికార్డు లను తయారు చేయాలని ఆదే శించారు.
మండలంలోని ఎర్రగుడి క్రీడా మైదానంలో మంగళవారం జరిగిన ఉపాధ్యాయ క్రికెట్ ఫైనల్ పోటీల్లో కణేకల్లు జట్టుపై బ్రహ్మసముద్రం జట్టు విజయం సాధించింది.
మండలంలోని వెంకటాద్రిపల్లి ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ. 80 వేలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, ల్యాప్టా్పను మంగళవారం అందజేశారు
మండలంలోని ఆర్అండ్బీ రహదారులకు రూ. 10 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు.
మండలంలోని నాగేపల్లిలో యల్లమ్మ రథోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
మండల రాజకీయాల్లో తెరవెనుక నడిచిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ఎంపీపీ పద్మ రాజీనామా వ్యవహారం చివరకు అధికారికంగా బయటపడింది.
ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని మంగళవారం మం డల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో స్తోత్రాద్రి కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు.
మండలపరిధిలోని చంద్ర బాబునాయుడు కాలనీలో అధికారులు తాగునీటి సరఫరా కోసం కొళా యిలు ఏర్పాటుచేశారు. కాలనీలోని రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన కొ ళాయి నీరు ఎటూ వెళ్లడానికి వీలు లేకుండాపోయింది. దీంతో కొళాయి చుట్టూ పెద్ద గుంత ఏర్పడి, నీరు నిలువ ఉంది. ఈ నీటిలో దోమలు విచ్చలవిడిగా వృద్ది చెందుతున్నాయి.