Share News

నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:24 AM

బస్సు లు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లకుండా.. కూడలిలో ప్రయాణికులను ఎక్కించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు.

నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్‌
నల్లమాడలో నిరుపయోగంగా ఆర్టీసీ బస్టాండ్‌

నల్లమాడ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): బస్సు లు ఆర్టీసీ బస్టాండ్‌లోకి వెళ్లకుండా.. కూడలిలో ప్రయాణికులను ఎక్కించుకునేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో ఆర్టీసీ భవనం నిరుపయోగంగా మారడంతో పాటు.. ప్రయాణికులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేం ద్రంలో 1990లో నాటి టీడీపీ ప్రభుత్వం తెలుగు గ్రామీణ క్రాంతి పథకం కింద బస్టాండ్‌ను ని ర్మించింది. బస్టాండ్‌ నిర్మాణం కోసం ఎకరా స్థలా న్ని స్థానికుడు దేశాయి శివకేశవరెడ్డి నాడు విరాళంగా ఇచ్చారు. బస్టాండ్‌ ప్రారంభం తరువాత కొన్నేళ్లు పాటు బస్సుల రాకపోకలతో రద్దీగా ఉండేది. ఆ బస్టాండ్‌లో ఒక క్యాంటిన, రెండు దుకాణాలు, కంట్రోల్‌ రూమ్‌, తాగునీటి సౌక ర్యం, మరుగుదొడ్లు, స్నానపు గదులుండేవి. ప్ర యాణీకులతో బస్టాండ్‌ కళకళలాడేది. రాత్రి స మయంలో నైట్‌హాల్ట్‌ బస్సులు మూడు ఉండే వి. అయితే 1997 నుంచి ఆర్టీసీ అధికారులు ఆ బస్టాండ్‌కు బస్సుల రాకపోకలను నిలిపేశారు. మండల కేంద్రంలోని కూడలిలోనే ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించుకొని వెళ్తున్నారు. దీంతో స్థానికులు కూడలిలో దుకాణాల ముందు బస్సు లు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. బస్టాండ్‌లోకి బస్సులు రాకపోతే తాము ఇచ్చిన స్థలాన్ని వెనక్కు ఇవ్వాలని దాత కుటుం బసభ్యులు కోరుతున్నారు. అధికారులు బస్టాండ్‌కు మరమ్మతులు చేయించి.. బస్సులు వచ్చివెళ్లేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Feb 25 , 2026 | 12:24 AM