రైతులకు అండగా ఉండండి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:29 AM
రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రెసిడెంట్లు, డైరక్టర్లను టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరాం కోరారు.
బత్తలపల్లి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రైతులకు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ప్రెసిడెంట్లు, డైరక్టర్లను టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరాం కోరారు. మండలంలోని కునుకుంట్లకు చెందిన శ్రీనివా్‌సరెడ్డి తాడిమర్రి ప్రెసిడెంటుగా, బాసికొండకి చెందిన రవింద్ర, నాగార్జున బత్తలపల్లి డైరక్టర్లుగా ఇటీవల నియమితులయ్యారు. తమకు పదవలు వచ్చేందుకు సహకరించినందుకు వారు పరిటాల శ్రీరాంను అనంతపురం టీడీపీ క్యాంపు కార్యాలయంలో మం గళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లో రైతులు ఎక్కువగా ఉన్నారని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ రుణాలు, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించి సహకరించాలని శ్రీరాం వారికి సూచించారు. వారి వెంట టీడీపీ నాయకులు నారాయణరెడ్డి, చల్లా శ్రీనివాసులు, సురేంద్ర, ఆంజిచేయులు, చౌదరి, రాము, సూరి పాల్గొన్నారు.