FISH: చెరువులోకి చేపపిల్లల విడుదల
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:08 AM
మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు.
కూడేరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి) : మండలపరిధిలోని రామచంద్రపురం వద్ద ఉన్న పొట్టి చెరువులోకి చేపల పెంపంకం కోసం టీడీపీ నాయకులు చేప పిల్లలను వదిలారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేత పయ్యావుల శ్రీనివాసుల సహకారంతో కైకలూరు నుంచి లక్ష చేప పిల్లలను కొనుగోలు చేసి మంగళవారం చెరువులోకి వదిలారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ చేపల నుంచి వచ్చే ఆదాయంతో చెరువు ల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. టీడీపీ నాయకులు బంగి వెంక టమప్ప, బళ్లారి వెంకటేశులు, బంగి రాము, బళ్లారి నాగేంద్ర, బళ్లారి రాము, బంగి మారుతి, బంగి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....