Home » Uravakonda
మండల పరిధిలోని నింబగల్లు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు తుంగభద్ర జలాలతో నిండిపోయింది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కాలువ లకు తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వదిలారు. అయితే మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్‌డబ్య్లూఎస్ అధికారులను అప్రమత్తం చేయడంతో వారు ప్రత్యేక ప్రణాళికతో 35రోజుల్లోనే రెండు చెరువులను నింపారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వర కు కురిసిన వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కొద్దిరోజులుగా ఎండల తీవ్రతకు అల్లాడిపోయిన ప్రజలు, రైతులకు కొంత ఊరటనిచ్చిం ది.
పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయి పర్యావరణ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మయ్య బుధవారం తెలిపారు. కేంద్రప్రభుత్వం ఆనలైనలో జాతీయ స్థాయిలో పర్యా వరణపై క్విజ్ పోటీలను బుధవారం నిర్వహించిందన్నారు.
మండల కేంద్రంలోని ఎస్‌ఎస్ ట్యాంక్ కా ర్యాలయ ప్రాంగణంలోను, ఫిల్టర్ బెడ్ల వద్ద మద్యం బాబులు రోజూ హంగామా చేస్తున్నారు. విచ్చల విడిగా మద్యం తాగు తూ చెరువు మొత్తాన్ని కలుషితం చేస్తున్నారు. 11 గ్రామాలకు తాగు నీ రు అందించే ట్యాంక్ వద్ద వివిధ గ్రామాలకు చెందిన మద్యం ప్రియులు కర్ణాటక, ఆంధ్ర మద్యం తెచ్చుకుని తాగి హంగామా చేస్తున్నారు.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పల్లెవెలుగు బస్సు నమూనాను మంగళవారం ఆర్టీసీ అధికా రులు ఏర్పాటుచేశారు. దానికి ఆర్టీసీ డీఎం ఖాజావలి ప్రారంభించి మా ట్లాడుతూ బస్టాండు సుందరీకరణలో భాగంగా బస్సు నమూనా ఏర్పాటు చేశామని తెలిపారు.
పట్టణ నడి బొడ్డున జీఎస్‌బీసీ మురుగు కాలువలా మారింది. ఇళ్లలోని మురుగు నీ టిని కాలువలోకి వదులుతుండడంతో మురుగునీటితో నిండి పోయింది. దాని నుంచి వచ్చే దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా కాలవ చెత్తాచెదారం, ముళ్లకంపలతో నిండిపోయింది. పట్ట ణ శివారులోని సీఐటీయూ కాలనీ నుంచి భీమిరెడ్డి కాలనీ వరకు కాలు వకు ఇరువైపులా నివాసముంటున్నారు.
మండలంలో బోరు బావుల కింద మిరప సాగును రైతులు ప్రారంభించారు. అదేవిధంగా జీబీసీ- హెచఎల్‌సీ కాలువ కింద పొలాలను సిద్దం చేసుకుంటున్నారు. అయి తే ఈ యేడు వర్షాభావ పరిస్థితి నెలకొనటంతో తుంగభద్రా డ్యాంకు ఇప్పటి వరకూ తగిన నీరు చేరకపోవడంతో మిరప సాగు చేసే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండల పరిధిలోని ఉదిరిపికొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరిచాలంటూ గ్రామస్థులు రోడ్డె క్కారు. వారు మంగళవారం గ్రామంలోని అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారిపై గంట పాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహిం చారు.
పట్టణం, అర్బన పరిధి లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సర్ విధులు కేటాయిస్తూ మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని టీఎనయూఎస్, యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు కోరారు. వారు మం గళవారం స్థానిక ఎమ్మార్సీలో ఎంఈఓ మస్తానరావుకు వినతి పత్రం అందజేశారు.
తాము ఎన్నికై ఐదేళ్లు పూర్తి అవుతున్నా మండల సమావేశాల్లో తాము చర్చించిన సమస్యలు తీరలే దంటూ ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వ హిం చారు.