Share News

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా

ABN , Publish Date - Jul 02 , 2026 | 11:52 PM

పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్‌ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్‌ లింపో ఇస్టియో సైటోసిస్‌ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు.

MINISTER: చిన్నారి వైద్య సాయానికి మంత్రి భరోసా
Minister Payyavula Keshav speaking with the little girl's family members.

ఉరవకొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): పట్టణానికి చెందిన హ నుమంతు కుమారుడు ఆర్నెల్ల లోకేష్‌ అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. మండలంలోని కౌకుంట్లలో ఆ చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి తమ కుమారుడిని కాపాడాలని విన్నవించారు. ప్రైమరీ ఈమో ఫాగో సైటిక్‌ లింపో ఇస్టియో సైటోసిస్‌ అనే వ్యాధితో బాధపడు తున్నాడని తెలిపారు. వైద్యానికి రూ. 15లక్షలు దాకా ఖర్చు అవుతుందని మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వారి కుటుంబానికి ధైర్యం చెబుతూ, మీ బిడ్డకు అవసరమైన చికిత్స అందేలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన హైదరాబాదులోని సింధు హాస్పిటల్‌ యాజమా న్యంతో ఫోనలో మాట్లాడారు. చిన్నారి లోకేష్‌కు ఎలాంటి ఆలస్యం లేకుం డా వైద్యం అందించాలని ప్రభుత్వం తరఫున చికిత్సకు అవసరమైన నిధు లను సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పసిబిడ్డకు పునర్జన్మ ఇవ్వడానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి పేర్కొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Jul 02 , 2026 | 11:52 PM