Home » Anantapur
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా ఆర్డీటీ, డీఎస్ఏ జట్లు నిలిచాయి. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక అశోక్నగర్ డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.
అవే సంస్థ ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేయనున్నట్లు అవే సంస్థ వ్యవస్థాపకులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు.
నగర శివారు ప్రాంతంలో రైల్వే గేటు వద్ద నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు అధ్వానంగా మారిం ది. దారంతా గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన సమీపంలో నాయక్నగర్ రైల్వే గేటు వద్ద నుంచి 44వ జాతీయ రహదారి వరకు దాదాపు 3 కి.మీ రోడ్డు గుంతల మయంగా ఉంది.
రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభు త్వం తమదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.9.70 లక్షల చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు.
అనంతపురం డిపోకు కొత్తగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ప్రారంభించారు. రెండు నూతన బస్సుల్లో ఒకదానిని అనంతపురం - నెల్లూరు, మరో బస్సును అనంతపురం - ఒంగోలు రూట్లకు కేటాయించారు. అనంతపురం డిపో ఆవరణలో శనివారం జోనల్ చైర్మన పూల నాగరాజు రిబ్బన కట్చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
మండలంలోని చిన్నంపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వా మి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రా మస్థుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యా హ్నం అన్నదానం చేశారు.
ప్రజా ప్రయాణ ప్రాంగణాలపై సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ కనిపించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యార్థులంతా దాదాపు సొంతూళ్లకు చేరుకున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు సోమవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం ఎటుచూసినా రోడ్లన్నీ వాహనాలమయమైంది.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పాల న సాగిస్తోందని ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. గార్లదిన్నెలోని రైతు సేవా కేందల్రో చీనీ ప్రోసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై గురువారం ఉద్యానవన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఏపీ ఫుడ్ సోసైటీ అధికారి శేఖర్బాబు ముఖ్య అతిథులుగా హాజరై రైతులతో చర్చించారు.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మరణిం చడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక శ్రీనగర్ కాలనీలోని అయ్యప్పస్వామి ఆలయం సమీపంలో గురువారం డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ నిర్వహణ ఆవరణంలో బాలకృష్ణ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు గౌస్మొద్దీన, ఎనబీకే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు జగనతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు.