FESTIVAL: ఘనంగా శివ పార్వతుల కల్యాణం
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:56 PM
మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.
తాడిపత్రి, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): మ హా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక బుగ్గ రామలింగేశ్వరుడి ఆల యంలో మంగళవారం శివపార్వతుల కల్యా ణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిం చారు. మునిసిపల్ చై ర్మన జేసీ ప్రభాకరరెడ్డి దంపతులు బుగ్గ రా మలింగేశ్వరస్వామికి, అ మ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం కల్యాణోత్సవం సందర్భంగా శివపార్వతు లకు పట్టు వస్ర్తాలు సమర్పించారు. మంగళ వాయిద్యాలతో వేదపం డితుల మంత్రోచ్ఛారణ మధ్య శివపార్వతుల కల్యాణం ఘనంగా నిర్వ హించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కల్యాణోత్సవం తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వినియోగం చేపట్టారు. సాయంత్రం గాంధీకట్ట వద్ద నుంచి మెయినబజార్ మీదగా అభయాంజనేయస్వామి ఆలయం వరకు రథోత్సవం నిర్వహించారు. రథోత్సవంలో పలువురి వివిధ వేషాధారణలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....