Home » Tadipatri
వైసీపీ హయాంలోని ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి ఆరోపించారు. ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి ఏం చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే తప్పేముందని జేసీ అస్మిత్‌రెడ్డి నిలదీశారు.
తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు.
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం కలచివేసిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. టౌన్ బ్యాంక్‌లో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బస్సుల నిర్మాణంలో లోపంవల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కొందరు మాట్లాడడం బాధాకరమని అన్నారు.
వివాహానికి వెళ్తానని పోలీసులకు ముందే లేఖ ద్వారా సమాచారం ఇచ్చానని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా.. ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని నిలదీశారు.
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి శుక్రవారం తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి ట్విస్ట్ ఇచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు . నిన్న(శనివారం) తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి భద్రత కల్పించారు పోలీసులు. ఇవాళ(ఆదివారం) తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడనే సమాచారంతో పోలీసులు బుధవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తున్నాడని తెలియడంతో జేసీ ప్రభాకర్‌రెడ్డి డీఎస్పీ ఆఫీసు వద్దకు వెళ్లాడని విశ్వసనీయ సమాచారం.
తాడిపత్రిలో పొలిటికల్ హీట్ నెలకొంది. నేడు వైసీపీ కీలక నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లనుండటంతో టెన్షన్ వాతవారణం నెలకొంది.
తాడిపత్రికి వెళ్లేందుకు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతాయని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసి డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.