Share News

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:42 AM

మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

- పెద్దారెడ్డి కుమారులకు జేసీ ప్రభాకర్‌రెడ్డి సవాల్‌

- వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు

అనంతపురం: వైసీపీ నాయకులకు తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy) మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఇక్కడి నేతలకు సీమ పౌరుషం లేదన్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారులు, ఇతర వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ‘దమ్ముంటే... తాడిపత్రి రండి’ అంటూ సవాల్‌ విసిరారు. గురువారం అనంతపురం వచ్చిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.


జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్‌ మార్నింగ్‌, ఈవెనింగ్‌ అంటూ షో చేస్తున్నాడన్నారు. ఆయన ధర్మవరానికి చేసింది ఏమీ లేదన్నారు. ఆయన ఏం చేశాడో చెప్పాలంటూ నిలదీశారు. సీమ పౌరుషం గురించి మాట్లాడే అర్హత కేతిరెడ్డి ఫ్యామిలీకి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులు తాడిపత్రిలో ప్రజల నుంచి దోచిన డబ్బుతోనే ఉప్పు, కారంతో తిని, ఇక్కడ మహిళలపైనే దాడులు చేశారన్నారు. ఇదేనా వారి పౌరుషం అంటూ ప్రశ్నించారు. 15 నెలలుగా పెద్దారెడ్డి కొడుకులు తాడిపత్రిలో కనిపించడం లేదన్నారు.


‘ఇదే నా మీ పౌరుషం?’ అంటూ ఆయన ప్రశ్నించారు. రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదంటూ వెంకట్రామిరెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. గత ఐదేళ్లూ తనపై పోలీసులతో దాడులు చేయించారన్నారు. తాను, తన కుమారుడిని జైళ్లకు పంపినా... తమ ఆస్తులను నాశనం చేసినా... తాడిపత్రి ప్రజల కోసం అక్కడే ఉన్నామన్నారు. కేతిరెడ్డి ఫ్యామిలీకి చీము, నెత్తురు ఉంటే తాడిపత్రి రావాలంటూ సవాల్‌ విసిరారు. రాయలసీమ లిఫ్ట్‌ గురించి మాట్లాడే అర్హత ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు లేదన్నారు. పుట్లూరు, యల్లనూరుకు ఎందుకు నీళ్లు రాలేదో చెప్పాలన్నారు.


pandu2.jpg

వారు ఏనాడూ గేట్లకు గ్రీసు కూడా పెట్టించలేదన్నారు. మాజీ మంత్రి శైలూ కొత్తగా వైసీపీలోకి చేరుకున్నాడనీ, ఆయన అతి మాటలు మాట్లాడడం మానుకోవాలంటూ ఘాటుగా హెచ్చరించారు. 76 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు పోలవరం కోసం తిరుగుతున్నారనీ, ఏపీ అభివృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. ఆయనను విమర్శించడం తగదన్నారు. ఎవరు నీళ్లు తెచ్చారో బహిరంగ చర్చకు రావాలంటూ ధర్మవరం మాజీ ఎమ్మెల్యేకు సవాల్‌ విసిరారు.


రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడిన కేతిరెడ్డికి నాలుగు గుర్రాలు, మినీ క్రూజర్‌ ఎలా వచ్చాయో సీమ పౌరుషం ఉంటే... ఉదయమే చెప్పాలంటూ సవాల్‌ విసిరారు. కేతిరెడ్డి ఫ్యామిలీని సీమ ప్రజలు తన్నడం ఖాయం అన్నారు. సీఎం చంద్రబాబు మంచివారని, ఆయన దయవల్ల వైసీపీ నాయకులు బతికిపోతున్నారన్నారు. తర్వాత తాడిపత్రి వైస్‌ చైర్మన్‌ షేక్షావాలి, కౌన్సిలర్లు రేష్మా, లక్ష్మీదేవి, మల్లికార్జున.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కొడుకుల దౌర్జన్యాలు, దాడులపై మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 10:42 AM