Home » Ananthapuram
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అనంతపురం జిల్లాలో కొత్త వివాదానికి తెరలేపాయి. మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మొత్తం 26 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు.
క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ రైళ్లు అనంతపురం జిల్లా గుంతకల్లు మీదుగా వెళతాయని రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లా దేవరెడ్డిపల్లికి చెందిన ధనుంజయ అలియాస్ ఆసిఫ్ ఇటీవల పాకిస్థాన్ అనుకూల నినాదాలతో సంచలనం రేపాడు. అతను ‘ఐ లవ్ పాకిస్థాన్, పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశాడు.
అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు పాకిస్థాన్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.
అనంతపురం జిల్లా కేంద్రంలోని తపోవనం సర్కిల్‌లో వై జంక్షన్ రాబోతోంది. ప్రస్తుతం 44వ జాతీయ రహదారి.. కర్నూలు నుంచి అనంతపురం మీదుగా కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్‌పోస్టు వరకు 261 కిలోమీటర్ల పొడవునా ఫోర్‌లేన్‌గా ఉంది.
అనంత నగరంలో వీధికుక్కలు 10 వేలకుపైగా ఉన్నాయంటే నమ్మడానికి చిత్రంగా ఉన్నా.. ఇది నిజం. వాటి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఏ వీధికెళ్లినా గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తున్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ సీటు వెనుక భాగంలో ‘ఫస్ట్ ఎయిడ్ బాక్స్’ అనేది ఒకటి ఉంటుంది. ప్రయాణం సందర్భంగా బస్సులో ఏదైనా ప్రమాదం జరిగితే.. ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన మందులు ఆ బాక్సులో అందుబాటులో ఉంచాలి.
ఏపీ వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు సైతం నీళ్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వ్యాఖ్యానించారు. చెరువులు జలకళను సంతరించుకోవడంతో గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇమిడియట్ యాక్షన్ తీసుకున్నారు. వెంటనే రోడ్డు మంజూరు చేశారు.