Share News

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

ABN , Publish Date - Feb 13 , 2026 | 10:55 AM

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.

జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం

  • చంద్రబాబు నేతృత్వంలోనే జలకళ

  • అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు

అనంతపురం: జగన్‌ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu) విమర్శించారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను వైసీపీ పాలనలో ఎక్కడికక్కడ ఆపేశారన్నారు. 2014- 2019 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా రూ.14వేల కోట్లు సీమ ప్రాజెక్టులకు వెచ్చించారని గుర్తు చేశారు. ప్రస్తుతం 20 నెలల కూటమి పాలనలో మరో రూ. 8వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.


చంద్రబాబు పాలనలో రాయలసీమకు దాదాపు రూ. 22195 కోట్లు ఖర్చు చేయగా... జగన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ. 2వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. దీన్నిబట్టి సీమ ప్రాజెక్టులపై ఎవరికి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలుగు గంగ, గాలేరు-నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు సీమ దశ, దిశను మార్చేశాయన్నారు. హంద్రీనీవా ద్వారా జీడిపల్లితో పాటు గొల్లపల్లి, చెర్లోపల్లి, బ్రాహ్మణపల్లి తదితర ప్రాజెక్టులు నీటితో కలకళలాడుతున్నాయన్నారు. జగన్‌ పాలనలో 200 ప్రాజెక్టులను ఆపగా... అందులో 102 ప్రాజెక్టులు రాయలసీమ జిల్లాలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వాటన్నింటిని దశల వారీగా పునఃప్రారంభిస్తోందన్నారు.


pandu3.2.jpgజీడిపల్లి-బీటీపీ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. వెనుకబడిన మడకశిర, కుప్పం, పుంగనూరు తదితర ప్రాంతాలకు హంద్రీనీవా జలాలను తరలించడంతో ఆ ప్రాంతాలు సస్యశామలమవుతున్నాయన్నారు. కియ కార్ల పరిశ్రమ రావడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారన్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించి రూ.లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నారన్నారు. హంద్రీనీవాలో అంతర్భాగమైన 36వ ప్యాకేజీ పనులను వెంటనే ప్రారంభించాలని, ఉంతకల్లు రిజర్వాయర్‌ పనులు, హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి:

632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు

నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 13 , 2026 | 10:55 AM