విస్తారంగా చామంతి సాగు
ABN , Publish Date - Feb 11 , 2026 | 11:32 AM
మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్‌లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతోపాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు.
పెరుగుతున్న ధరలు
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
గాండ్లపెంట(అనంతపురం): మండల వ్యాప్తంగా పలు గ్రామాలలో రైతులు చామంతి పంటను విస్తారంగా సాగు చేశారు. రైతులు ఖరీఫ్, రబీ సీజన్‌లో వివిధ రకాలైన కూరగాయలు, ఉద్యాన పంటలతో పాటు పూల సాగుపై మక్కువ చూపుతున్నారు. ఈ మేరకు మండలంలో బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ తదితర రకాల పూలను సాగు చేస్తున్నారు. రైతులు పూల మొక్కలను సాగు చేయాలంటే ఎకరాకు రూ. లక్ష నుంచి రూ.1.5 లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంది. బుర్ర చామంతి, డెకరేషన్ చామంతి రకాలపై మండలంలోని రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
డెకరేషన్ చామంతి పూలమొక్కలను కర్ణాటక(Karnataka), ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి సాగుచేస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరిగేందుకు వివిధ రకాల రసాయన మందులకు రూ. వేలల్లో ఖర్చు చేస్తున్నారు. ఇవే కాకుండా చామంతి మొక్కలు ఏపుగా పెరగడానికి విద్యుత్ బల్బ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎకరా సాగుకు రూ.లక్షకు పైబడి వస్తోందని రైతులు తెలుపుతున్నారు. అయితే గత రెండు నెలలుగా చామంతి, బంతి పూల ధరలు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో కొంతమంది రైతులు నష్టాలు చవిచూశారు.
రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
మండల పరిధిలోని వివిధ గ్రామాలలో చామంతి పూలను విరివిగా సాగు చేశారు. రెండు నెలలుగా ధరలు అంతంత మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం బుర్ర చామంతి కిలో రూ.50 నుంచి రూ.80 వరకు, డెకరేషన్ చామంతి రూ.80 నుంచి రూ.130 వరకు మార్కెట్‌లో ధరలు ఉన్నాయి. దీంతో రైతులకు కొంతమేర ఊరట లభిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుందని, చామంతి ధరలు పెరుగుతాయనీ రైతులు ఆశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News