తప్పు చేయకుంటే ఎందుకు పారిపోయారు?
ABN , Publish Date - Feb 13 , 2026 | 09:40 AM
వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రశ్నించారు.
వైసీపీ సభ్యులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రశ్న
అనంతపురం: వైసీపీ నేతలు తిరుమల లడ్డూ సహా పలు అంశాల్లో తప్పులు చేయకపోతే అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్(Daggupati Venkateswara Prasad) ప్రశ్నించారు. అసెంబ్లీలో గురువారం జరిగిన బడ్జెట్ సమాశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చర్చిస్తే అన్ని అంశాల్లో నిజాలు బయటకొస్తాయనే వాకౌట్ చేశారన్నారు. వైసీపీ హయాంలో జరిగినవన్నీ కల్తీ, అవినీతి వ్యవహారాలేనన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News