కోడికత్తితో హత్య
ABN , Publish Date - Feb 11 , 2026 | 10:53 AM
కోడి కత్తితో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన లింగమయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వివాహేతర సంబంధమే కారణం
ముగ్గురు నిందితుల అరెస్టు
పెనుకొండ(అనంతపురం): కోడి కత్తితో యువకుడిని హత్య చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. రొద్దం మండలం పెద్దకోడిపల్లికి చెందిన లింగమయ్య హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలను స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రాఘవన్ మంగళవారం వెల్లడించారు. లింగమయ్య తన గ్రామానికే చెందిన మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేవాడు. ఈ విషయమై ఆమెకు వరుసకు సోదరుడైన పెద్దకోడిపల్లికే చెందిన మనోజ్ పలుమార్లు హెచ్చరించాడు.
అయినా.. లింగమయ్య పద్ధతి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో లింగమయ్యను చంపేయాలనుకున్నాడు. తన స్నేహితులు నవీన్, ప్రభా్‌సతో కలిసి పథకం పన్నాడు. అందులో భాగంగా ఈనెల 3వ తేదీన పెద్దకోడిపల్లి శివారులోకి తీసుకెళ్లి గొడవ పడ్డారు. వెంట తెచ్చుకున్న కోడికత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో లింగమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిపై లింగమయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా రొద్దం మండలం పెద్దమంతూరు వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News