Share News

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:39 AM

పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు.

చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం

  • ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

మడకశిర(అనంతపురం): పట్టు రైతులకు పూర్వవైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు(MLA MS Raju) పేర్కొన్నారు. స్థానిక పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో సోమవారం రైతులకు సబ్సిడీ పరికరాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత వైసీపీ పాలకులు పట్టు పరిశ్రమను నిర్వీర్యం చేశారన్నారు. పట్టు రైతులు, రీలర్లకు బకాయిలు కూడా చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. మడకశిర మండలం గుండుమల గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినపుడు పట్టు రైతుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు.


pandu2.2.jpgదీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీతో యంత్ర పరికరాల పంపిణీ, మిగిలిన వారికి 50 శాతంతో అందించి, ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ లక్ష్మీనారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాసమూర్తి, మండల కన్వీనర్‌ నాగరాజు, పట్టు పరిశ్రమ శాఖాధికారులు, రైతులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

బంగారం, వెండి స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌ సేవల విస్తరణకు చర్యలు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 10 , 2026 | 11:39 AM