Home » MS Raju
తిరుమల రాజకీయ నిరుద్యోగి భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమల పవిత్రత దెబ్బతిన్నేలా ప్రతిరోజు అసత్యపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
డ్వాక్రా సంఘాల సృష్టికర్త సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు.ప్రతి మహిళా ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో డ్వాక్రా సంఘాలను సీఎం ప్రవేశపెట్టారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 270మంది యానిమేటర్లకు బయోమెట్రిక్ డివైస్ లను పంపిణీ చేశారు.
‘ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే.. అసెంబ్లీకి వస్తానంటున్న నీకు సిగ్గుందా..?’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఫైరయ్యారు. ఆయన మంగళవారం నగరంలోని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
శవాల పునాదులపైనే జగన్ వైసీపీని నిర్మించారు. ఆయన బయటకు రావాలంటే ఎవరైనా చావాలి. లేదంటే చంపేందుకు వస్తారు’ అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నదెవరో, దళితుల కు ఎవరు ఏం చేశారో చర్చించేందుకు సిద్ధమా అని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వైసీపీ నేతలకు సవాలు విసిరారు.
MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు
: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన కల్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఆయన మండిపడ్డారు. ఆర్ అండ్ బీ అతిథి గృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంటు వ్యవస్థకు అప్రతిష్ట తెచ్చిన నీచుడు.. ఓ పిచ్చోడు ఈ జిల్లాలో ఉన్నాడు. చేసింది మరిచిపోయి సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు, పవన కల్యాణ్‌ను ...
ప్రజాసేవ పేరుతో చాలామంది రాజకీయాల్లోకి వస్తుంటారు.. కానీ కొందరు మాత్రమే నిస్వార్థంగా ప్రజాసేవకు అంకితమవుతారు. మరికొందరు ప్రజాసేవ ముసుగులో తమ స్వార్థప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తారు. కానీ మడకశిర తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మాత్రం నిజమైన ప్రజాసేవకు నిదర్శనంగా నిలిచారు.