Share News

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..

ABN , Publish Date - Aug 21 , 2025 | 01:57 PM

వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

MLA MS Raju: టీటీడీపై కావాలనే బురద చల్లుతున్నారు..
MS Raju

అనంతపురం: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. ప్రతి నిత్యం దేవస్థానంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. టీటీడీ ప్రతిష్ఠను పెంచేలా చైర్మన్ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆయన ఇవాళ(గురువారం) మీడియాతో మాట్లాడారు..


వైసీపీ నేతలు టీటీడీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ.. కాలం గడుపుతున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. టీటీడీపై ఆరోపణలు చేస్తూ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తిరుపతిలో జిరాక్స్ సెంటర్ పెట్టుకున్న నీకు వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఒక్క రూపాయి కూడా టీటీడీ డబ్బు ఎవరు వాడుకోలేదని స్పష్టం చేశారు. టీటీడీపైన, చైర్మన్ పైన అనవసరంగా బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వమంటే జగన్ రెడ్డి నానా యాగీ చేస్తున్నారని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేయని వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. టీటీడీ మీద మీరు చేసే ఆరోపణలను నమ్మే స్థితిలో జనాలు లేరని ధీమా వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను అనేక సేవల్లో భాగస్వామ్యం చేసేలా టీటీడీ పనిచేస్తుందని ఎంఎస్ రాజు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కేటీఆర్ కీలక నిర్ణయం.. కవిత లేఖాస్త్రం

భారీ వర్షాలు, వరదలు.. నిలిచిన రాకపోకలు

Updated Date - Aug 21 , 2025 | 01:57 PM