Home » TTD
ఆంధ్రప్రదేశ్: తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి స్విమ్స్(SWIMS)లో చికిత్సపొందుతున్న బాధితులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) పరిహారం అందజేశారు. రామసముద్రానికి చెందిన తిమ్మక్క, విశాఖపట్నానికి చెందిన ఈశ్వరమ్మకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఆయన పరిహారం అందించారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు.
Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట జరిగి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహరించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని తిట్టాలంటూ వారందరికి నగదు కవర్లు అందజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి మరికాసేపట్లో అత్యవసర భేటీ కానుంది. ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నాటకీయ పరిణామాల మధ్య అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశం నిర్వహించాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు నిర్ణయించారు.
Tirupati Stampede: ముక్కోటి ఏకాదశి జరగనున్న వేళ.. టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాట తనను తీవ్రంగా బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజలకు క్షమాపణలు చెప్పాలని టీటీడీ చైర్మన్, ఈవోలను డిమాండ్ చేశారు.
తొక్కిసలాట ఘటనకు టీటీడీ, ప్రభుత్వ వైఫల్యమే కారణమని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి(Former TTD Chairman Bhumana Karunakar Reddy) ఆరోపించారు.
అది... స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్, ఈవో సంయమనం కోల్పోయారు.
బైరాగిపట్టెడలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద బందోబస్తు బాధ్యతలను తిరుపతిలో క్రైమ్ డీఎస్పీ రమణకుమార్కు అప్పగించారు.
టీటీడీ పాలక మండలికి సామాన్య భక్తులే ప్రాధాన్యం కావాలని, సమూలంగా ప్రక్షాళన జరిగితేనే అది సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ చేసేందుకు బైరాగిపట్టెడలోని రామానాయుడు మునిసిపల్ స్కూల్ కేంద్రానికి బుధవారం ఉదయం 9గంటల నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకోవడం మొదలైంది.