Share News

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Feb 10 , 2026 | 09:35 PM

తిరుపతిలో శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

మహాపాపానికి ఒడిగట్టిన జగన్: మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఫిబ్రవరి 10: తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం చేసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహా పాపానికి ఒడిగట్టాడని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై జగన్ అండ్ కో చేస్తున్న వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా బుకాయింపు మాటలు మానుకోండంటూ వారికి సూచించారు. మంగళవారం మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర విలేకర్లతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఒక బఫూన్‌లా మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. లడ్డూలో కల్తీ జరిగిందని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) స్పష్టంగా చెబుతున్నా జగన్ అండ్ కో బుకాయించేలా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.


2019లో నిబంధనలు సడలించడం వల్లే లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సిట్ తన నివేదికలో స్పష్టం చేసిందని వివరించారు. ఒక వైపు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట వాస్తవమే అని చెబుతున్నారని గుర్తు చేశారు. కానీ ఆ కల్తీ ఎలా జరిగిందో తనకు తెలియదంటూ తప్పించుకునే మాటలు మాట్లాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డిపై కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు.


వైసీపీకి చెందిన వైవీ సుబ్బారెడ్డే కల్తీ జరిగిందని చెబుతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం బుకాయింపు మాటలు మాట్లాడటం సిగ్గు చేటు అని అన్నారు. అయోధ్యకు పంపిన లడ్డూలు తిరుపతి నుంచి పంపలేదని పేర్ని నాని చెబుతున్నాడని.. అంటే తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని ఒప్పుకున్నట్టేగా అంటూ పేర్ని నానికి చురకలంటించారు. జగన్ చేతిలో కీలుబొమ్మల్లా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమేత్తారు. కలియుగ దైవంతో పెట్టుకున్న వారు గతంలో ఏమైపోయారో చూశామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి సైతం కలియుగ దైవం తప్పక శిక్ష వేస్తాడని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ వ్యాఖ్యలు నా వ్యక్తిగతం.. క్షమించండి: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ

For More AP News And Telugu News

Updated Date - Feb 10 , 2026 | 09:48 PM