లవ్ జిహాద్ టైపులో.. లడ్డూ జిహాద్ జరిగిందేమో.. శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 09 , 2026 | 12:16 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు..
విశాఖపట్నం, ఫిబ్రవరి 9, (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి (Swami Srinivasananda Saraswati) సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీ టైపులో లడ్డూ జిహాద్ జరిగిందేమోననే అనుమానం తమకు ఉందన్నారు. వైసీపీ హయాంలో లడ్డూని కల్తీ చేశారని ధ్వజమెత్తారు. ఇంతవరకు ఎప్పుడూ లడ్డూ వివాదం లేదని, జగన్ హయాంలో తిరుపతి లడ్డూ నాణ్యత లేదని.. ఇది అన్యమతస్తుల కుట్ర అని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూను హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారని...ఈ విషయంలో తాము చాలా బాధపడుతున్నామని తెలిపారు. జగన్ పాలనలో తిరుపతి లడ్డూపై చర్చ జరిగిందని ప్రస్తావించారు. లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నాయకులు మాట్లాడినప్పుడు తాము పట్టించుకోలేదని అన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సీబీఐ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. సోమవారం విశాఖపట్నంలో శ్రీనివాసానంద సరస్వతి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
సిట్ రిపోర్టుతో భయాందోళన..
సిట్ రిపోర్టుతో తాము భయాందోళనకు గురయ్యామని, సిట్ నివేదికతో హిందువులు ఆందోళన చెందుతున్నారని శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. రూ.20 కోట్ల లడ్డూలు కల్తీ అయ్యాయని సీబీఐ తేల్చిందని చెప్పుకొచ్చారు. పమిత్రమైన లడ్డూలో ఫుడ్ మాఫియా జరిగిందని ఆరోపించారు. రసాయనాలు కలిసిన లడ్డూ తిని భక్తులు అనారోగ్యాలు పాలయ్యే అవకాశం ఉందని అన్నారు. లడ్డూ కల్తీపై సీబీఐ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేసినవారు వేంకటేశ్వరస్వామి శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. రెండు కొండలు అన్న రాజశేఖర్ రెడ్డికి ఎంత శిక్ష పడిందో అందరూ చూశారని ప్రస్తావించారు. దయచేసి లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని సూచించారు. సిట్ రిపోర్ట్ ఆధారంగా తక్షణమే ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లడ్డూ కల్తీపై అప్పటి పాలకవర్గం నైతిక బాధ్యత వహించాలని, హిందూ సమాజానికి వెంటనే జగన్ అండ్ కో క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ రిపోర్టుపై నమ్మకం లేదని వైసీపీ నేతలు అనడం విడ్డూరంగా ఉందని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రతి లడ్డూ కౌంటర్‌లో యూపీఐ పేమెంట్!
సైబర్ నేరగాళ్ల వేధింపులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య
Read Latest Telangana News And AP News And Telugu News