Home » YS Jagan Mohan Reddy
కాకినాడ పోర్టులో ప్రధాన వాటాను లాక్కొని అరబిందో వాళ్లకు కట్టబెట్టడం జగన్ రెడ్డి అరాచకానికి ఉదాహరణ అని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఈనెల ఆరో తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల్లో వైసీపీ నేతల భూ దందాలపై కూడా ప్రజలు ఫిర్యాదులు ఇవ్వవచ్చని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి సెటైర్లు కురిపించారు. జగన్కు లండన్ మందులు పనిచేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయన గొప్పలకు రూ.1300 కోట్లు ఖర్చు చేసిన దానికి సన్మానం చేయాలని విమర్శించారు.
వైసీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై స్టే ఇవ్వడానికి చీఫ్ జస్టిస్ బెంచ్ నిరాకరించింది. ఐసీఏఐ వాదనలపై కౌంటర్ దాఖలు చేస్తామని విజయ్ సాయి రెడ్డి తరుపు న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
అదానీని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల చెక్కు ఎందుకు తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. అదానీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసుకున్న ఒప్పందాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
మోదీ, అమిత్ షా దేశాన్ని అదానీ, అంబానికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కే ఏ పాల్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షించడానికి తాను పోరాడుతున్నానని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
జగన్ ఐదేళ్ల పాలనలో సంపద సృష్టించి ఉంటే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. జగన్ పాలనలో డిస్కంలపై రూ. 18 వేల కోట్లు బకాయిల భారం మోపారని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు
అడ్డగోలు ఒప్పందానికి... అర్థంలేని సమర్థన! పైగా... శాలువాలు కప్పాలి, సన్మానాలు చేయాలి అనే డిమాండ్లు!
అదానీతో కలిపి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్కాం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ఈ విషయంపై షర్మిలకు మాజీ మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ప్రపంచ ఆర్థిక నేరగాడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పరువెక్కడ ఉందని ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. ఆయన పరువు నష్టం దావా వేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఆనం వెంకట రమణా రెడ్డి విమర్శించారు.