Share News

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..

ABN , Publish Date - Feb 06 , 2026 | 10:22 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పరామర్శించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..
YS Jagan Mohan Reddy

విజయవాడ, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) విజయవాడ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో ఆయనను పరామర్శించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరఫున భరోసా ఇచ్చేందుకు జగన్ ఈ పర్యటన చేపట్టినట్లు సమాచారం. పోలీసులు జారీ చేసిన నిబంధనలను అతిక్రమించకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు వైసీపీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వస్తున్నాయి.


విజయవాడ వారధి మీదుగా వెళ్లాల్సిన యాత్రను మార్చుకుని మంగళగిరి, ఎర్రబాలెం మీదుగా వెస్ట్ బైపాస్ నుంచి ఇబ్రహీంపట్నం ద్వారా జోగి రమేశ్ ఇంటికి చేరుకోనున్నారు జగన్. ఆయన పర్యటన దృష్ట్యా వెస్ట్ బైపాస్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.


రూట్ మ్యాప్ మార్పునకు కారణాలివే..

వైఎస్ జగన్.. తన పర్యటనలో భాగంగా విజయవాడ వారధి మీదుగా వెళ్లాలని తొలుత నిర్ణయించుకున్నారు. అయితే ఈ విషయంపై విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న(గురువారం) రాత్రి జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ వారధి విజయవాడకు అత్యంత కీలకమైన మార్గమని, జగన్ ఇటువైపుగా వెళ్తే భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. సాధారణ ప్రజలకు, అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో జగన్ తన రూట్ మార్చుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల ఆంక్షలు, నోటీసుల నేపథ్యంలో జగన్ తన ప్రయాణ మార్గాన్ని మార్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 06 , 2026 | 11:11 AM