Share News

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర

ABN , Publish Date - Feb 07 , 2026 | 09:26 AM

మాజీ సీఎం జగన్ పరామర్శ యాత్రలపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. బూతులు తిట్టి రెచ్చగొట్టే వారి పరామర్శలకు వెళ్తూ విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

వైసీపీ అథఃపాతాళానికి పడిపోవడం ఖాయం: మంత్రి కొల్లు రవీంద్ర
Minister Kollu Ravindra

అమరావతి, ఫిబ్రవరి 7: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై(Former CM YS Jagan Mohan Reddy) రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ఐదేళ్లు ఆటవిక రాజ్యం ఎలా ఉంటుందో చూపించిన జగన్‌కు ‘జంగిల్ రాజ్’ అవార్డు ఇవ్వాలి అని వ్యాఖ్యానించారు. ఆటవిక రాజ్యంతో పార్టీ కార్యాలయాలు, దేవాలయాలపై.. జగన్ దాడులు చేయించారని ఆరోపించారు. బూతులు తిట్టి, రెచ్చగొట్టి, తన్నులు తిన్నవారిని పరామర్శించేందుకు వెళ్తూ.. విద్వేషాల వెనుక తానే ఉన్నానని జగన్ చాటుకుంటున్నారని ఆయన అన్నారు.


తెనాలిలో బ్లేడ్ బ్యాచ్ పరామర్శకు వెళ్లిన జగన్.. తాను అలాంటి వారినే ప్రోత్సహిస్తాననే సందేశమిచ్చారంటూ మంత్రి మండిపడ్డారు. బూతుల వల్లే 151 నుంచి 11కి వైసీపీ పడిపోయిందన్నారు. గంట, అరగంట అంటూ నిస్సిగ్గుగా మాట్లాడిన వారికి, చంద్రబాబు ఇంటిపై దాడిచేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. మంత్రులుగా చేసినా.. ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా అక్రమ సంపాదనపై పడిన చెత్త నాయకులే జగన్‌కు కీలకమని విమర్శించారు రవీంద్ర.


తెలుగుదేశం నేతలపై హత్యాయత్నం చేసిన తురకా కిశోర్‌కు మున్సిపల్ ఛైర్మన్ పదవి ఇచ్చారని మంత్రి తెలిపారు. వైసీపీ ఇకనైనా బుద్ధి తెచ్చుకోకపోతే అథఃపాతాళానికి పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. బాబాయ్‌ని హత్య చేయించి 18 గంటలు ప్రయాణం చేసిన తరహాలోనే.. నిన్న(శుక్రవారం) 25 కిలోమీటర్ల దూరానికి గంటలు గంటలు ప్రయాణించారంటూ కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

ఎన్టీఆర్ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..

రేసు గుర్రాలు.. చైర్మన్‌ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 11:03 AM