Home » Devotional
పుష్య పౌర్ణమి జనవరి 3వ తేదీన వచ్చింది. ఈ రోజు కొన్ని తప్పులు చేస్తే.. ఏడాది పొడవునా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవలసి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా సామాన్య భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా రేపటి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది.
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజీనామా చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయ ఈవోగా వెంకట్రావు అప్పట్లో పనిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట ఈవోగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం.
భారత దేశంలో ఎన్నో పవిత్ర పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో ఒకటి షిర్డీ. కోట్లాది మంది భక్తులకు ఇది ఒక పవిత్ర నిలయం. కులమతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనే సిద్దాంతం ఈ ఆలయ ప్రత్యేకత.
శ్రీశైల మల్లికార్జునస్వామి ఆలయ పాలకమండలి మరో కీలక నిర్ణయం తీసుకుంది. చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అందించే కార్యక్రమాన్ని ఇవాళ(మంగళవారం) ఘనంగా ప్రారంభించింది. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేశ్నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టును సందర్శించనున్నారు. జనవరి మూడో తేదీన డిప్యూటీ సీఎం కొండగట్టుకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనకాపల్లిలో నిర్వహించిన సంపూర్ణ నారాయణీయం పారాయణ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది. శ్రీకృష్ణ మాధురీయం బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ పారాయణంలో భక్తులు భక్తిశ్రద్ధలతో నారాయణీయాన్ని పఠించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తారు. ఈ ప్రత్యేక పర్వదినాన్ని పురస్కరించుకుని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలంటే..