ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకం
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:47 AM
ఈ వారం రాశిఫలాలు. 15-2-2026 - ఆదివారం, ఆ రాశి వారికి ఈ వారం అన్నివిధాలా ఆశాజనకంగా ఉంటుంది.
అనుగ్రహం
15 - 21 ఫిబ్రవరి 2026
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యానుకూలత ఉంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకువ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆహ్వానం అందుకుంటారు. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఉల్లాసంగా గడుపుతారు. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
నిర్విరామంగా శ్రమిస్తారు. ఒత్తిడి, చికాకులు అధికం. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోండి. మీ తప్పులు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఫైనాన్స్, చిట్స్‌ల జోలికి పోవద్దు. పరిచయస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. ప్రముఖులను కలి సినా ఫలితం ఉండదు. పనులు,కార్యక్రమాలు ముందుకు సాగవు. అవివాహితులకు శుభ వార్తా శ్రవణం. మానసికంగా కుదుటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురికావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. చెల్లింపుల్లో జాగ్రత్త. ఆటంకాలెదురైనా పనులు పూర్తి చేయగల్గుతారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. కీలక పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాల కలిసివచ్చే సమ యం. తలపెట్టిన కార్యం సఫలమవుతుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు భారమని పించవు. ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. ప్రముఖులకు చేరువవుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. మీ ఇష్టాయిష్టాలను స్పష్టంగా తెలియజేయండి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. పిల్లల కదలికలపై దృష్టిసారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
వ్యవహారాలతో తీరిక ఉండదు. సావకాశంగా ఆలోచించి నిర్ణయం తీసు కోవాలి. పెద్దలను సంప్రదించటం శ్రేయస్క రం. పనులు మందకొడిగా సాగుతాయి. చీటికిమాటికి చికాకుపడతారు. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. అపరిచితులను ఓ కంట కనిపెట్టండి. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
అన్నివిధాలా ఆశాజనకం. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పనులు అను కున్న విధంగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయస్తు లతో తరచూ సంభాషిస్తుంటారు. ఆర్భాటాలకు ఖర్చుచేస్తారు. పెద్దమొత్తం చెల్లింపుల్లోజాగ్రత్త. ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. ప్రలోభాలకు గురికావద్దు. అనుభవజ్ఞులను సంప్రదించండి. కీలక పత్రాలు, వస్తువులు జాగ్రత్త.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. ఆత్మీ యుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ప్రము ఖులకు చేరువవుతారు. పిల్లల దూకుడు అదుపు చేయండి. మీ సాయంతో ఒకరికి లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
లక్ష్య సాధనకు కృషి ప్రధానం. నిరుత్సాహం వీడి శ్రమించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పెద్దఖర్చు తగిలే సూచనలున్నాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలెదురవుతాయి.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది.పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
గ్రహాల సంచారం బాగుంది. మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆహ్వానం అందు కుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. స్థిరాస్తి అమర్చుకోవాలనే కోరిక బలపడు తుంది. అందరితోనూ మితంగా సంభాషిం చండి. మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు. పెద్దల చొరవతో వివాదంసద్దుమణుగుతుంది.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఆర్థికలావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. సంస్థల స్థాపనలకు అనుకూలం. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిడికి గురికావద్దు. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పిల్లల చదువులపై శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. గృహమార్పు కలిసివస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ధనలాభం, వాహనసౌఖ్యం పొందుతారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆహ్వానం అందుకుంటారు. కొత్త యత్నాలు మొదలెడతారు. గృహంలో శుభకార్యం నిశ్చయమవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
‘నేనే రాజు.. నేనే మంత్రి..’ అదే నిజమా..!
గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్
Read Latest Telangana News and National News