Share News

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:19 AM

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అరుదైన గౌరవం లభించింది. సుదీర్ఘకాలం పాటు ప్రజా ప్రతినిధిగా పని చేసిన నర్సయ్య.. అవినీతికి తావు లేకుండా...

గుమ్మడి నర్సయ్యకు గౌరవ డాక్టరేట్‌

  • పురస్కారం ప్రదానం చేసిన గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ వర్సిటీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు అరుదైన గౌరవం లభించింది. సుదీర్ఘకాలం పాటు ప్రజా ప్రతినిధిగా పని చేసిన నర్సయ్య.. అవినీతికి తావు లేకుండా నిబద్దతతో ప్రజలకు సేవలందించారు. అందుకు ఆయనకు గ్లోబల్‌ హ్యూమన్‌ పీస్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పురస్కారం అందజేసింది. చెన్నైలోని భారతీయ విద్యాభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వర్సిటీ జాయింట్‌ డైరెక్టర్‌ గౌని నర్సింహ గౌడ్‌, ఎండీ అరిఫుద్దీన్‌ చేతుల మీదుగా ఈ అవార్డును గుమ్మడి నర్సయ్య అందుకున్నారు. ఏళ్ల తరబడి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నా.. నేటికీ సామాన్య జీవితం గడుపుతున్న నర్సయ్యకు ఈ పురస్కారం లభించడంపై ఇల్లందు వాసులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 15 , 2026 | 06:19 AM