Home » andhrajyothy
లండన్‌లో అత్యంత విలాసవంతమైన ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో ఒకటి ‘లేన్స్‌బరో’. 2019లో చిన్న పిల్లిపిల్లగా ఉన్నప్పుడు ఆ హోటల్లోకి ప్రవేశించింది లిలిబెట్. ఈ పిల్లిగారు అడుగుపెట్టిన వేళావిశేషం... ఆశ్చర్యంగా ఒక్కసారిగా హోటల్ లాభాలు చవిచూసిందట. అతిథులు అధిక సంఖ్యలో రావడం, హోటల్ రేటింగ్ పెరగడం, సిబ్బంది పనిలో ఉత్సాహం రెట్టింపైందట.
భారతీయుల రోటీలు నచ్చక మొగలాయీ ప్రభువు బాబర్, ‘నాన్’ రోటీలు తయారు చేసే వంటవాళ్లనీ, వంటపదార్థాల్నీ ఇరాన్, ఉజ్బెకి స్తాన్ నుండి వెంట తెచ్చుకున్నాడు. వాళ్లతో వచ్చింది ఇక్కడికి మైదా! మొగలాయీలకు, యూరోపియన్లకూ ఇది విలాస రుచి!
పెళ్లి పనుల హడావిడిలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రెండు నెలల్లో క్రమం తప్పకుండా కొన్ని అలవాట్లను పాటించాచాలి. ఆరోగ్యంగా ఉండడానికి, ముఖ్యంగా మూడు విషయాలపైన శ్రద్ధ పెట్టాలి- సమతుల ఆహారం, శారీరక వ్యాయామం, సరిపడా నిద్ర.
నిర్మాణరంగంలో వస్తున్న విప్లవాత్మక ఆర్కిటెక్ట్ డిజైన్లు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వృక్ష, పక్షి జాతులను... ప్రకృతి వింతలను స్ఫూర్తిగా చేసుకుని ఇంజనీర్లు... కళ్లు మిరమిట్లుగొలిపే నిర్మాణాలను ఆవిష్కరిస్తున్నారు. అదే ‘బయోమిమిక్రీ ఆర్కిటెక్చర్’ ట్రెండ్. ప్రపంచవ్యాప్తంగా ఈ విధానంలో రూపొందిన కొన్ని అద్భుత భవనాలపై ఓ లుక్కేద్దాం...
దూరం నుంచి చూస్తే బోట్లన్నీ తిరగబడి కనిపిస్తుంటాయి. ఆ ఊరంతా అలా తిరగబడిన బోట్లే కనిపిస్తాయి. ఈక్విహెన్ ప్లేజ్ గ్రామస్తులు వెరైటీగా పడవలను తిరగేసి ఇల్లుగా మార్చుకుంటారు. ఆ గ్రామంలో ఏ ఇంటిని చూసినా తిరగబడిన పడవే పైకప్పుగా కనిపిస్తుంది.
కొత్త పుస్తకం ఆవిష్కరించడానికి ఒక వేదిక కావాలి. ప్రముఖ రచయితలు, పబ్లిషర్లను కలుసుకునేందుకు మార్గం కావాలి. సాహిత్య ప్రియులు కోరుకునేది ఇదే. ఇలాంటి వారికోసం ‘బుక్ ఎక్స్పో అమెరికా’ స్వాగతం పలుకుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనైనా పుస్తక ప్రదర్శనలను ఏటా ఒకే చోట నిర్వహిస్తుంటారు.
నాకు చిన్నప్పటి నుంచి సంగీతమంటే ప్రాణం. ఆ మక్కువతోనే తరచూ రేడియోల్లో పాటలు వినేదాన్ని. టీవీలో సంగీత కార్యక్రమాల్ని ఆసక్తిగా చూసేదాన్ని. ఎక్కడ సంగీత ప్రదర్శనలు జరిగినా వెళ్లేదాన్ని... అన్నారు ప్రముఖ నటి గిరిజా ఓక్. విభిన్న శైలిలో పాటలు ఎలా పాడాలో చూసి నేర్చుకున్నానని, మరాఠీలోని ‘సింగింగ్ స్టార్’లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచాపపి ఆమె అన్నారు.
తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు చేదూ ఆరు రుచులూ కలగసిన షడ్రసోపేత వంటకం కచోరీ. ఉత్తరాదిలో కచోరీ ప్రసిద్ధి. సూరదాసు ‘పూరీ సపూరీ కచౌరౌ కౌరీబ సదళ సు ఉజ్వల సుందర శౌరీ’ అంటూ పొంగిన పూరీలు ... పొరలు పొరలుగా బంగారు రంగులో మెరిసే గుండ్రని కచ్చౌరీల ఉజ్వల సుందర శోభను వర్ణిస్తాడు.
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.
ఘార అనే సంస్కృత పదానికి ‘చల్లటం’ అని అర్థం. నేతిని చేతిలో పోయించుకుని అన్నం మీద చల్లి అప్పుడు కలుపుకుని తినేవాళ్లు. అభిఘారం అంటే ఇదే! అలా నెయ్యి గానీ, పాలు గాని చల్లుతూ గోధుమ పిండిని తడిపి ముద్దలా చేసి ఉండలు కట్టి, ఒక్కో ఉండనీ బిళ్ళలుగా చేసి నేతిలో వేగించి పంచదార పాకం పట్టిన బూరెలు ఘారాపూపకాలు.