Share News

రోడ్డు మీద ఒక్క వీధి కుక్క కనిపించదు...

ABN , Publish Date - Jan 25 , 2026 | 12:22 PM

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీధి కుక్కల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆసియా దేశాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇండియా, థాయిలాండ్‌ దేశాలైతే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాయి.

రోడ్డు మీద ఒక్క వీధి కుక్క కనిపించదు...

వీధుల్లో ఆడుకుంటున్న లేదా వెళ్తున్న పిల్లలపై కుక్కలు దాడి చేసే సంఘటనలు తరచూ వింటూనే ఉంటాం. ఇటీవల ఈ అంశం కోర్టు దాకా చేరింది. ఒక్క శునకం కూడా వీధుల్లో కనిపించకూడదని, అన్నింటినీ షెల్టర్‌ హోమ్స్‌కి తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది కూడా. అయితే... వీధుల్లో ఒక్క శునకం కనిపించని దేశం ఒకటుందని మీకు తెలుసా?

డచ్‌ ప్రజలు పెట్స్‌ని అమితంగా ఇష్టపడతారు. పార్కుల్లో కుక్కతో వాకింగ్‌ చేస్తారు. బైక్‌ బాస్కెట్లలో పప్పీని పెట్టుకుని తిరుగుతారు. మెజారిటీ కేఫ్‌లు, రెస్టారెంట్లకు పెట్స్‌ను తీసుకుని హ్యాపీగా వెళ్తారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో పెట్స్‌తో కలిసి నగరమంతా చుట్టేస్తారు. అయితే అక్కడ వీధుల్లో మాత్రం ఒక్క కుక్క కూడా కనిపించదు. అది నెదర్లాండ్స్‌ సాధించిన గొప్ప విజయంగా ప్రజలు సెలబ్రేట్‌ చేసుకుంటారు. ప్రపంచంలో వీధి శునకాలు కనిపించని మొట్టమొదటి దేశంగానూ నెదర్లాండ్స్‌ గుర్తింపు పొందింది.


ఎలా సాధ్యమైంది?

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వీధి కుక్కల సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆసియా దేశాల్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. ఇండియా, థాయిలాండ్‌ దేశాలైతే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నాయి. చివరకు కోర్టులు సైతం కలగజేసుకుని, వెంటనే వీధి కుక్కల సమస్యను పరిష్కరించమని ఆదేశాలు జారీ చేసే వరకు పరిస్థితి వచ్చింది. అయితే సమస్యను ఎదుర్కొంటున్న దేశాలన్నీ నెదర్లాండ్స్‌ను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు.


book7.2.jpgఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా ఏళ్ల పాటు నెదర్లాండ్స్‌ అధికారులు ఒక ప్రణాళిక ప్రకారం నిబద్ధతతో పనిచేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారం, జంతు చట్టాలను కఠినంగా అమలు చేయడం ద్వారా వీధి కుక్కలు లేకుండా చేశారు. ప్రధానంగా డచ్‌ అధికారులు ‘సీఎన్‌వీఆర్‌’ సిస్టమ్‌ను అమలు చేశారు. అంటే వీధి కుక్కలను పట్టుకోవడం, సంతానోత్పత్తి కలగకుండా చేయడం, వ్యాక్సిన్‌ ఇవ్వడం, షెల్టర్‌కు పంపడం చేశారు. డాగ్‌షెల్టర్‌ల పర్యవేక్షణ కోసం అధికారులను నియమించారు. ఎవరైనా పెట్స్‌ కలిగి ఉంటే వాటి పూర్తి బాధ్యత యజమానిదే అని ప్రకటించారు.


book7,3.jpgఒక కుక్క ఎట్టి పరిస్థితుల్లో యజమాని వెంట లేకుండా వీధుల్లో కనిపించకూడదు. ఒకవేళ యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించి పెట్‌ని వదిలేసినట్టు రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా చట్టాలు రూపొందించారు. షెల్టర్స్‌లో వదిలిన కుక్కలకు మైక్రోచిప్‌ అమర్చారు. షెల్టర్‌ నుంచి కుక్క బయటకు వస్తే సులభంగా గుర్టుపట్టేందుకు మైక్రోచిప్‌ ఉపకరిస్తుంది. నియమాల ఉల్లంఘనను గుర్తించేందుకు యానిమల్‌ పోలీసింగ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవన్నీ సత్ఫలితాలను ఇవ్వడంతో నెదర్లాండ్స్‌ వీధి శునకాలు కనిపించని దేశంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి.

చిల్లర పనులకు రాలేదు

అమరావతిని అడ్డుకోలేరు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2026 | 12:44 PM