Share News

అమరావతిని అడ్డుకోలేరు

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:17 AM

అమరావతి విషయంలో నాటకాలు వేశారు. మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు. కేసులు వేశారు. అడ్డుకుంటానని జగన్‌ మళ్లీ ప్రకటించారు.

అమరావతిని అడ్డుకోలేరు

  • రాష్ట్రానికి ఇదే శాశ్వత రాజధాని.. ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతా: సీఎం

  • కరెంటు చార్జీలు పెంచం

  • జగన్‌ ప్రభుత్వం 32 వేలకోట్లు పెంచింది

  • రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మార్చింది

  • ప్రభుత్వ ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు

  • ఆఖరికి దేవుడి నెయ్యినీ కల్తీ చేశారు

  • నేను క్రెడిట్‌ చోరీ చేశానంటున్నారు

  • అసలు జగన్‌కేం క్రెడిట్‌ ఉంది?

  • ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండండి

  • మేం వచ్చాక 18 నెలల్లోనే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి

  • దేశానికి వచ్చినవాటిలో ఏపీకే 25 శాతం

  • స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో సీఎం చంద్రబాబు

  • గత ప్రభుత్వంలో రూ.700 కోట్లు ఖర్చు చేసి జగన్‌ తన ఫొటోను

పట్టాదారు పుస్తకాల మీద, సర్వే రాళ్ల మీద వేసుకున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌తో భూములు కాజేసే ప్రయత్నం చేశారు. మేం వాటిని రద్దు చేశాం. నేను క్రెడిట్‌ చోరీ చేశానంటున్నారు. అసలు ఆయనకేం క్రెడిట్‌ ఉంది? ఇలాంటి వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

-సీఎం చంద్రబాబు

నగరి, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి విషయంలో నాటకాలు వేశారు. మూడు ముక్కలాట ఆడారు. అమరావతిని శ్మశానం అన్నారు. కేసులు వేశారు. అడ్డుకుంటానని జగన్‌ మళ్లీ ప్రకటించారు. ఎవరు అడ్డుకున్నా ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతా. రాష్ట్ర రాజధానిగా అమరావతి శాశ్వతంగా ఉంటుంది. ఎన్ని కుయుక్తులు పన్నినా అమరావతిని అడ్డుకోలేరు’ అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం చిత్తూరు జిల్లా నగరిలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కరెంటు చార్జీలు పెంచడం లేదని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో రూ.32 వేల కోట్ల చార్జీలను పెంచిందని విమర్శించారు.


వైసీపీ వేసి న రూ.4,600 కోట్ల డ్యూటీ ఫీజును ప్రజల పై భారం పడకుండా తమ ప్రభుత్వం రద్దు చేసినట్లు చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. దేశంలోని వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మనకే వచ్చాయన్నారు. ఐదు దశాబ్దాలుగా తాను రాజకీయాల్లో ఉన్నాన ని, 94 శాతం అభ్యర్థులు గెలవడం ఎప్పు డూ చూడలేదని అన్నారు. తాను ఈ సారి చేయగలుగుతున్న అభివృద్ధి గత మూడు దఫాల్లో చేయలేకపోయానన్నారు.


నాడు అన్నింటా నిర్లక్ష్యం

‘రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలి. జల్‌ జీవన్‌ మిషన్‌లో రూ.లక్ష కోట్ల మేర వాడుకునే అవకాశం ఉన్నా గతంలో నిర్లక్ష్యంతో వదిలేశారు. కేంద్ర పథకాలన్నీ నిర్వీర్యం చేశారు. రాష్ట్రాన్ని గంజాయికి కేంద్రంగా మార్చారు’ అంటూ గత వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక ఈగల్‌ వ్యవస్థను పెట్టి గంజాయిని కట్టడి చేశామన్నారు. ‘పోలవరం డయాఫ్రం వాల్‌ను వరదల్లో కొట్టుకుపోయేలా చేశారు. ఇప్పుడు మళ్లీ నిర్మిం చి 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం. రాయలసీమ వరకు నీళ్లను తెస్తాం’ అని స్పష్టం చేశారు.

దేవుడి నెయ్యినీ కల్తీ చేశారు

ప్రభుత్వ ఉద్యోగులకు కూడా గత జగన్‌ ప్రభుత్వం రూ.వేల కోట్ల బకాయిలు పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. తాము విడతల వారీగా నిధులు ఇస్తున్నామని తె లిపారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను కూడా మూసేశారని, ఆఖరికి దేవుడి నెయ్యినీ కల్తీ చేశారని మండిపడ్డారు. ‘సూపర్‌ సిక్స్‌ పథకాల అమలు అ సాధ్యమని విమర్శించారు. కూటమి ప్రభు త్వం సూపర్‌ హిట్‌ చేసి చూపించింది. ఏడాదికి రూ.33 వేల కోట్లను పేదల కోసం పంపిణీ చేస్తున్నాం. ప్రతి నెలా ఒకటో తేదీన పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. ప్రజ ల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.


కార్యకర్తలను మరచిపోను

టీడీపీకి ఉన్నంతమంది కార్యకర్తలు ప్రపంచంలో ఏ పార్టీకీ లేరని సీఎం చంద్రబాబు అన్నారు. నగరిలో ఎస్సీ హాస్టల్‌కు వెళ్లి సోలార్‌ ప్లాంటును పరిశీలించారు. కార్యకర్తల సమావేశంలో సుదీర్ఘంగా మా ట్లాడారు. ‘టీడీపీకి ఉన్న కార్యకర్తలు ఏ పార్టీకి లేరు. మిమ్మల్ని మరచిపోను. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాను. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలి.’ అన్నారు.

Updated Date - Jan 25 , 2026 | 05:54 AM