Share News

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్

ABN , Publish Date - Feb 17 , 2026 | 02:43 PM

జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు.

వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Swami Srinivasananda

విశాఖపట్నం, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి (Swami Srinivasananda) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్వామి వారికి 20 కోట్ల కల్తీ లడ్డూలను ప్రసాదంగా సమర్పించారని.. ఇది మహా అపచారమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలో స్వామి శ్రీనివాసనంద సరస్వతి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ హయాంలో చారిత్రాత్మకమైన తప్పిదం జరిగిందని అన్నారు.


స్వామీజీలను విమర్శిస్తున్నారు..

తప్పును సరిదిద్దుకోకుండా వైసీపీ నేతలు ఇప్పటికీ స్వామీజీలను విమర్శిస్తూ.. టార్గెట్ చేస్తున్నారని స్వామి శ్రీనివాసనంద సరస్వతి ధ్వజమెత్తారు. అపచారం కారణంగా స్వామివారికి ఆగ్రహం కలగకుండా.. అనుగ్రహం కలిగేలా ఏమి చేయాలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించామని తెలిపారు. విజయవాడలో త్వరలో ప్రాయశ్చిత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వివరించారు. విజయవాడలో జరిగే ప్రాయశ్చిత్త కార్యక్రమం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. స్వామి వారి అనుగ్రహం వల్లే.. కల్తీ లడ్డూలు తిన్నా ఎవరికీ ఏమీ జరగలేదని చెప్పుకొచ్చారు.


స్వామిని క్షమించమని కోరతాం..

కొంతమంది చేసిన దుర్మార్గపు పనికి.. స్వామి వారిని క్షమించమని కోరతామని స్వామి శ్రీనివాసనంద సరస్వతి అన్నారు. అందరూ స్వామి వారికి ముడుపులు కట్టి.. ఒకేసారి గోవింద నామస్మరణ చేస్తామని తెలిపారు. విజయవాడలో జరిగే ప్రాయశ్చిత కార్యక్రమానికి సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ని, మంత్రుల దంపతులను ఆహ్వానిస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి దంపతులను కూడా ఆహ్వానిస్తామని అన్నారు. వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారు ఎవరూ ఇంతవరకు బతికి బట్ట కట్టలేదని హెచ్చరించారు. తమ సవాల్‌కు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఎందుకు స్పందించట్లేదని స్వామి శ్రీనివాసనంద సరస్వతి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీ ప్రభుత్వంపై బిల్‌గేట్స్ ప్రశంసలు..

ఏపీ అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలక మలుపు: పవన్ కల్యాణ్

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 17 , 2026 | 05:02 PM