నెయ్యి కొనుగోలు విధానంలో విప్లవాత్మక మార్పులు: బీఆర్ నాయుడు
ABN , Publish Date - Feb 17 , 2026 | 08:50 PM
శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు.
తిరుమల, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ప్రసాదాల నాణ్యతను, పవిత్రతను కాపాడేందుకు టీటీడీ బోర్డు కట్టుబడి ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి కొనుగోలులో పారదర్శకత, నాణ్యతకు పెద్దపీట వేశామన్నారు.
తిరుమల వేదికగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడారు. 2024కి ముందు శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై విమర్శలు, భక్తుల అనుమానాలను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నెయ్యి కొనుగోలు విధానంలో ప్రస్తుత టీటీడీ బోర్డు విప్లవాత్మక మార్పులు చేపట్టిందని నొక్కిచెప్పారు. నెయ్యి కొనుగోలు విధానాలు, నిబంధనలలో కీలక మార్పులు తీసుకున్నామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ కుటుంబమే తిరుమల పవిత్రతని దెబ్బతీసింది.. అచ్చెన్నాయుడు ధ్వజం..
వేంకటేశ్వరస్వామితో ఆటలాడే వారెవరూ బతికి బట్టకట్టలేదు.. స్వామి శ్రీనివాసనంద సరస్వతి ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News